అవినీతిని కప్పి పుచ్చుకొనేందుకే మామా అల్లుళ్ళు బాబుపై ఎదురుదాడి: రేవంత్

తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై చాలా నిశితంగా విమర్శలు చేసారు. “ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు కడితే దిగువనున్నవి అడ్డుకోలేవనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ మామా అల్లుళ్ళు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులను కట్టవద్దని, నీళ్ళు వాడుకోవద్దని చంద్రబాబు చెప్పలేదు. ప్రాజెక్టులు కట్టేటప్పుడు దిగువనున్న తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడమని మాత్రమే చెపుతున్నారు. దాని కోసం ఆయన కేంద్రానికి లేఖ వ్రాస్తే అందులో తప్పేమిటి? తెలంగాణా ఎగువనుంది గాబట్టి నీళ్ళు మన అధీనంలోనే ఉంటాయి. మనం విడిచిపెడితే తప్ప క్రిందకు ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళదు. నీళ్ళు రాకపోతే ఆంధ్రాలో ప్రజలకు, రైతులకు కష్టం అవుతుందనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి మామ అల్లుళ్ళు ఇద్దరికీ తెలుసు. అయినా దీనిపై వారు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారంటే ఆ ప్రాజెక్టులలో రీ డిజైనింగ్ పేరుతో జరుగుతున్న భారీ అవినీతిని కప్పి పుచ్చుకొని ప్రజల దృష్టిని మళ్ళించడానికే. అందుకే వారు మళ్ళీ తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.”

“వైకాపా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ఆయన కంపెనీకి పాలమూరు, ప్రాణహిత, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు కేటాయించిన మాట వాస్తవం కాదా?ప్రాజెక్టులు కట్టాలనుకొంటే కట్టి చూపించాలి కానీ అనవసరమయిన ఈ రాద్ధాంతం ఎందుకు?వాటిలో అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నిస్తుంటే ఉలికిపాటు ఎందుకు? ప్రాజెక్టుల ద్వారా తెలంగాణా అంతటా నీళ్ళు పారాలి. అదే సమయంలో దిగువనున్న ఆంధ్రాలో రైతులకి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని చెపుతున్నాము. ఎవరికీ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా మేము నిలదీస్తూనే ఉంటాము,” అని రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురూ మూడు రకాలుగా వాదిస్తున్నారు.

“మా రాష్ట్రంలో మా ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకొంటాము..ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదు..ప్రశ్నిస్తే కుట్రలు చేస్తున్నట్లే…రాళ్లతో కొడతాము కబడ్ధార్!” అని కేసీఆర్ హెచ్చరిస్తున్నారు.

“నీళ్ళ కేటాయింపులపై విభజన చట్టాన్ని పట్టించుకోకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మిస్తూ దిగువనున్న ఆంధ్రాని ఎండబెట్టేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

“ప్రాజెక్టులలో జరుగుతున్న భారీ అవినీతిని కప్పి పుచ్చుకొనేందుకే మామా అల్లుళ్ళు ఇద్దరూ తెలంగాణా సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని” రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య నీళ్ళ పంపకాలు. దానిని చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం ఉంది. కానీ ఆ పని చేయకుండా తమతమ రాజకీయ ప్రయోజనాలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసి ఆ సమస్యని ఇంకా జటిలం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close