‘సెటిల‌ర్’ సెంటిమెంట్ ప‌ట్టుకున్న రేవంత్‌..!

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్ర పార్టీ నేత‌లు హ‌డావుడిగా ఉన్నారు. రాహుల్ టూర్ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వ‌స్తుంద‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, తెలంగాణలో ఉంటున్న సెటిల‌ర్ల విష‌య‌మై కాంగ్రెస్ పార్టీ ఒక స్ప‌ష్ట‌మైన విధానాన్ని తీసుకున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. ముఖ్యంగా సీమాంధ్రుల‌కు తెలంగాణ రాజ‌కీయాల్లో ప్రాధాన్య‌త క‌ల్పిస్తామ‌ని రాహుల్ ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌ని ఇప్ప‌టికే ఆ పార్టీ నేత‌లు చెప్పారు. అయితే, ఇదే అంశ‌మై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజాగా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక ఏయే సమ‌స్య‌ల‌పై ముందుగా ప‌రిష్క‌రించాల‌నే అంశాల‌ను దృష్టిపెట్టుకుని రాహుల్ ప‌ర్య‌ట‌న ఉంటోంద‌ని రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌తోపాటు, తెలంగాణేతులను కూడా కాంగ్రెస్ ఒకేలా చూస్తుంద‌న్నారు. ఇక్క‌డికి వ‌చ్చి, కొన్నేళ్లుగా ఇక్క‌డే ఉంటూ ఓటు హ‌క్కు కూడా వ‌చ్చిన త‌రువాత.. ఏ ప్రాంతం వారైనా ఇక్క‌డివారే అనేది కాంగ్రెస్ అభిప్రాయం అన్నారు. సీమాంధ్రుల సెటిల‌ర్ల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెరాస చేస్తున్న వ్యాఖ్య‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల‌నీ, భ‌ద్రత క‌ల్పిస్తాం అంటుంటార‌న్నారు. ప‌ద్నాగేళ్ల‌పాటు కేసీఆర్ మిమ్మ‌ల్ని అవ‌మానించార‌నీ, ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత కూడా గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్ల‌లో ప్ర‌త్యేకంగా చేసిందేం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికీ తెరాస ప్ర‌త్యేకంగానే సెటిలర్ల‌ను చూస్తోంద‌నీ, త‌మ‌కు అలాంటి అభిప్రాయం లేద‌నీ, అంద‌రూ స‌మాన‌మే కాంగ్రెస్ భావిస్తోంది రేవంత్ చెప్పారు.

ప‌ద్నాలుగేళ్లుగా సెటిల‌ర్ల‌ను కేసీఆర్ అవ‌మానించారు అనే అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్థావిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడ‌టం గ‌మ‌నార్హం! అంతేకాదు, సీఎం అయ్యాక కూడా సెటిలర్ల‌ను ప్ర‌త్యేకంగానే చూశార‌నే అభిప్రాయాన్నీ ప్ర‌చారం చేసుకునే దిశ‌గా కాంగ్రెస్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి, తెరాస కూడా సెటిల‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చాన్నాళ్ల కింద‌టే చేసింది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల్లో టిక్కెట్లు కూడా సీమాంధ్రుల‌కు ఇస్తామ‌న్న‌ట్టుగా సంకేతాలు ఇస్తోంది. ఈ త‌ర‌హా హామీలు, సంకేతాలు తెరాస నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అయితే లేవు. సెటిల‌ర్ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా ఒక సెంటిమెంట్ పట్టుకుని ముందుకెళ్లే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టింది. ఇలాంటి అంశాన్ని రేవంత్ రెడ్డి అయితే ప‌క్కాగా తీసుకెళ్ల‌గ‌ల‌ర‌న‌డంలో సందేహం లేదు. మ‌రి, దీనికి కౌంట‌ర్ గా తెరాస నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయో చూడాలి. రాజ‌కీయంగా కూడా సెటిల‌ర్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తామ‌న‌డం కొంత‌వ‌ర‌కూ కాంగ్రెస్ కు అనుకూలించే అంశం అవుతుంద‌నే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close