ఐదేళ్ల రివ్యూ : అమరావతి ఇంకా పేపర్లపైనే ఎందుకు ఉంది..?

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండే నగరం విజయవాడ. వాణిజ్య రాజధానిగా కూడా ఉంది. అందుకే విజయవాడను రాజధాని ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ.. చంద్రబాబు…” ధింక్ బిగ్ ” అన్నట్లుగా… అటు చెన్నై, మరోవైపు బెంగళూరు.. ఇంకో వైపు దూరమైపోయిన హైదరాబాద్‌ను తలదన్నేలా నగరాన్ని నిర్మించాలని సంకల్పించారు. అయితే.. అది భవనాలతో రాదు. ప్రజారాజధాని రావాలి. దేశం నలుమూలలు.. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచం నలుమూలల నుంచి ఉపాధి కోసం.. అమరావతికి తరలి రావాలి.. అన్నంత పెద్ద ప్లాన్‌తో అమరావతి నగర నిర్మాణం చేపట్టారు. అయితే.. అసలు కన్నా.. గ్రాఫిక్స్ ఎక్కువ కావడంతో సమస్య వచ్చింది. అక్కడ ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నా.. కళ్ల ముందు గ్రాఫిక్సే కనిపిస్తున్నాయి.

ఐదేళ్లలో ఒక్క గ్రాఫిక్ అయినా రియాల్టీకి చేరిందా..?

రాజధానిలో సీడ్ క్యాపిటల్ ఏరియాలో ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలు ప్రధానం. వీటిలో ఒక్క సచివాలయం పనులు మాత్రమే… జరుగుతున్నాయి. మిగతా వాటికి ఇప్పుడిప్పుడే పునాదులు వేస్తున్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం ఓ రూపు తీసుకురాలేకపోవడం… వైఫల్యం. ఇప్పటికిప్పుడు కార్యకలాపాలు నిర్వహించడానికి భవనాలు నిర్మించినా… ప్రభుత్వమే వాటిని తాత్కలికంగా ప్రచారం చేసుకోవడంతో… ప్రతిపక్ష పార్టీల విమర్శలకు బలం లభించినట్లియంది. నిజానికి అమరావతిలో ఇప్పుడు.. పనులు వేగంగా సాగుతున్నాయి. ముందుగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. రాజధాని అంటేనే అఖిల భారత సర్వీసు అధికారులు, వివిధ స్థాయి ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కొలువు తీరే పరిపాలనా కేంద్రం. వీరందరి కోసం 61 టవర్లలో 3,840 అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఇవన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల కోసం 186 బంగ్లాలను నిర్మించారు. మంత్రుల కోసం మరో 36 బంగ్లాలు నిర్మాణంలో ఉన్నాయి. అమరావతిలోని పాలనా నగరం విస్తీర్ణం ఒక కిలోమీటరు వెడల్పు… 6.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం రాజధానిలో రవాణాకు కీలకమైనది, ప్రత్యేకమైనది సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌! విజయవాడ- గుంటూరు దారిలో కనకదుర్గ వారధి నుంచి దొండపాడు వరకు… 21.2 కిలోమీటర్ల దారి దాదాపుగా పూర్తయింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 60 మీటర్లు.. అటూ, ఇటూ రాకపోకలకు వదిలేస్తే… మధ్యలో రెండు లైన్లను బీఆర్‌టీఎస్‌, మెట్రో రైలు వ్యవస్థ కోసం వదిలేశారు. పరిపాలనా నగరిలోని జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు అయింది. పూర్తిస్థాయి హైకోర్టు నిర్మించిన తర్వాత ఇందులో సిటీ సివిల్‌ కోర్టులను నిర్వహిస్తారు. 4 ఎకరాల్లో… 2.35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు.

భూములిచ్చిన రైతులే అసలు హీరోలు..!

ఓ పరిశ్రమకు వంద ఎకరాలు సేకరించాలంటే… భూ పోరాటాలతో దద్దరిల్లిపోతున్న సమయం ఇది. అలాంటిది చంద్రబాబు పిలుపు మేరకు… ఆయనపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ప్రాణ సమానమైన భూములను త్యాగం చేసి అందించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సీఆర్డీయే రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించింది. ఒప్పందంలో భాగంగా లేఅవుట్లలో ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే టెండర్లు దక్కించుకున్న కంపెనీలు శాఖమూరు, నేలపాడు ఐనవోలు, తుళ్లూరు, నెక్కల్లు లేఅవుట్లలో అభివృద్ధి పనులు చేశారు. రాజధాని గ్రామాల్లో రోడ్లను విశాలం చేశారు. అమరావతిలో పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. వీటిలో విట్‌, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అమృత, ఎన్‌ఐడీ క్యాంపస్‌ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. దొండపాడు సమీపంలోని పిచుకలపాలెం రెవెన్యూ పరిధిలో బీ ఆర్‌ శెట్టి మెడికల్‌ సిటీ హెల్త్‌కేర్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌, నవులూరు రెవెన్యూలో కింగ్స్‌ కాలేజీ ఆఫ్‌ లండన్‌ ఇండో-యూకే హెల్త్‌ సంస్థ కూడాకు కూడా శంకుస్థాపనలు జరిగాయి.

రాజధాని అంటే భవనాలే కాదుగా…!

భౌతికంగా కనిపించే నిర్మాణాలే రాజధాని అన్నట్లుగా.. ప్రభుత్వం గ్రాఫిక్స్‌ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకు రావడంతో… విమర్శలు వచ్చాయి. వాటిని సాకారం చేస్తామన్న నమ్మకాన్ని భూములు ఇచ్చిన రైతులకు.. ప్రజలకు కల్పించారో లేదో కానీ.. అమరరావతిపై సగటు నవ్యాంధ్ర పౌరునికి.., ఎంతో నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని వమ్ము కానీయబోమని నమ్మిస్తూ.. టీడీపీ.. ఎన్నికల ప్రచారానికి వెళ్తోంది. అదే సమయంలో… విపక్ష పార్టీలు… అక్కడ ఏమీ జరగడం లేదన్న ప్రచారాన్ని జోరుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఆ క్రమంలో… ప్రభుత్వం.. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను.. ప్రజల ముందు ఉంచడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. వివిద జిల్లాల నుంచి ఉచిత సందర్శన ఏర్పాట్లు చేసింది. దృశ్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతుంది. అయితే.. అంచనాలను .. ప్రభుత్వమే భారీగా పెంచుకోవడం వలన.. అనుకున్నంతగా అమరావతి నిర్మాణం కాలేదన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఏర్పడింది.

చిటికెలో చేస్తామని చెప్పడం వల్లే సమస్య వచ్చిందా..?

రాజధానిలో ఒక్క ఇటుక పడలేదని.. విపక్ష పార్టీలు చెబుతూంటాయి. నిజంగానే అక్కడ ఇటుకలు పడటం లేదు. అత్యాధునిక టెక్నాలజీతో… ఇటుకలు లేకుండానే నిర్మాణాలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏమైనా.. అమరావతి నిర్మాణం ప్రభుత్వం చెప్పినట్లు గ్రాఫిక్స్ రూపం నుంచి రియాల్టీకి రావాలంటే.. కనీసం 20 ఏళ్లు పడుతుంది. దాన్ని ప్రభుత్వం చిటికెలో చేస్తామన్నట్లుగా చెప్పడం వల్లే సమస్య వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close