ప‌వ‌న్‌పై వ‌ర్మ సెటైర్‌

ఈమ‌ధ్య ఎందుకో ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు వ‌ర్మ‌. ట్వీట్ల‌లో, మాట‌ల్లో ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. చాలా రోజుల‌కు మ‌ళ్లీ ప‌వ‌న్ మాటెత్తాడు వ‌ర్మ‌. ‘ప‌వ‌న్‌ని ముఖ్య‌మంత్రిగా చూడాల‌నివుంది’ అంటూ సెటైర్ వేశాడు. ”ప‌వ‌న్‌ని చూడాలంటే ఇది వ‌ర‌కు సినిమా పేజీ వ‌ర‌కూ వెళ్లేవాళ్లం. ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి అయితే ఫ్రంట్ పేజీలోనే చూడొచ్చు. ఓ అంద‌మైన ముఖ్య‌మంత్రిగా ఆయ‌న పేరు తెచ్చుకోగ‌ల‌రు” అంటూ త‌న‌దైన స్టైల్‌లో సెటైర్ వేశాడు. పాల్‌ని కూడా ఆయ‌న ముఖ్య‌మంత్రిగా చూడాల‌నుకుంటున్నార‌ట‌. అదెందుకు?? అని అడిగితే… ”ఇది వ‌ర‌కు కామెడీ సినిమా కోసం ఇది వ‌ర‌కు థియేట‌ర్‌కి వెళ్లేవాళ్లం. పాల్ ముఖ్య‌మంత్రి అయితే ఆ అవ‌స‌రం ఉండ‌దు” అని చ‌మ‌త్క‌రించాడు.

కేసీఆర్ బయోపిక్ తీస్తాన‌ని వ‌ర్మ అప్ప‌ట్లో చాలా హ‌డావుడి చేశాడు. ఆ తర‌వాత త‌న దృష్టి `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`పై ప‌డింది. “కేసీఆర్ బయోపిక్ త‌ప్ప‌కుండా తీస్తా.. అందుకు సంబంధించిన రీసెర్చ్ జ‌రుగుతుంది“ అంటూ క్లారిటీ ఇచ్చాడు వ‌ర్మ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close