కె.ఏ పాల్‌నీ వ‌ద‌ల‌నంటున్న వ‌ర్మ‌

రాంగోపాల్ వ‌ర్మ – కేఏ పాల్‌… వీరిద్ద‌రిలో ఎవ‌రు టీవీల్లో క‌నిపించినా, ఎవ‌రు మైకు ప‌ట్టుకున్నా.. బోలెడంత కాల‌క్షేపం. వీరిద్ద‌రూ ఏం మాట్లాడినా, ఎవ‌రి కోసం మాట్లాడినా, ఎందుకోసం మాట్లాడినా…. మ‌న‌కు మాత్రం భ‌లే ఎంట‌ర్‌టైన్‌మెంట్ దొరికేస్తుంది. కానీ అదేంటో వీరిద్ద‌రికీ ఒక్క క్ష‌ణం కూడా ప‌డ‌డం లేదు. పాల్‌పై వ‌ర్మ‌, వ‌ర్మ‌పై పాల్ సెటైర్ల మీద సెటైర్లు వేసేసుకుంటూనే ఉన్నారు.

వ‌ర్మ‌తో ఎవ‌రు పెట్టుకున్నా అంతే సంగ‌తులు. ఈ విష‌యం పాల్‌కి తెలీదేమో. పోయి పోయి.. వ‌ర్మ‌ని డిస్ట్ర‌బ్ చేశాడు. దాంతో వ‌ర్మ పాల్‌ని ఓ రేంజులో ఆడుకోవ‌డం మొద‌లెట్టాడు. ఇప్పుడు పాల్ ని ప్ర‌ధాన పాత్ర‌గా చేసుకుని ఓ సినిమా తీయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. కే.ఏ పాల్‌.. చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంద‌ట‌. ఓ విధంగా ఇది పాల్ బ‌యోపిక్ అనుకోవొచ్చు. కాక‌పోతే.. ఇందులో పాల్‌ని హీరోలా కాకుండా ఓ జోక‌ర్‌లా చూపించోతున్నాడ‌ట‌. ఒక‌వేళ పాల్ మీద సినిమా సాధ్యం కాక‌పోతే.. త‌న రాబోయే చిత్రాల్లో పాల్ లాంటి పాత్ర‌ని సృష్టించి వినోదం పంచాల‌ని వ‌ర్మ డిసైడ్ అయ్యాడు. వ‌ర్మ అనుకున్నాడంటే.. సాధ్యం కాక‌పోవ‌డానికి ఏముంది?? తెర‌పై పాల్ ని చూడ‌డం ఖాయం. మ‌రి దీనిపై కేఏ పాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close