వంగ‌వీటి కోసం బిగ్ ని రంగంలోకి దింపుతున్న వ‌ర్మ‌

త‌న సినిమాకి మార్కెట్ ఎలా చేసుకోవాలో వ‌ర్మ‌కి తెలిసినంత‌గా ఎవ్వ‌రికీ తెలీదేమో..?? ‘నోటు’తో కాకుండా కేవ‌లం నోటి మాట‌తోనే ప‌బ్లిసిటీని పీక్స్ కి తీసుకెళ్లిపోతాడు. ‘వంగ‌వీటి’ సినిమా కోసం ఎలాంటి ప్ర‌త్యేక‌మైన ప‌బ్లిసిటీ అవ‌స‌రం లేకుండా పోయింది. ఆ పేరే… ఆ సినిమాకి కావ‌ల్సినంత హైప్ తీసుకొచ్చేసింది. అయినా స‌రే.. వ‌ర్మ వ‌ద‌ల‌డం లేదు. ఎలాగైనా స‌రే.. ఆ సినిమా క్రేజ్‌ని ఒక్క‌సారిగా ప‌దింత‌ల‌కుతీసుకెళ్లిపోవాల‌ని ప్లాన్ చేశాడు. అది అట్టాంటిట్టాంటి ప్లాన్ కాదు. మాస్ట‌ర్ ప్లాన్‌. ఒక విధంగా మెగాస్టార్ ప్లాన్‌.

వంగ‌వీటి ప్ర‌మోష‌న్ల కోసం వ‌ర్మ ఏకంగా బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని రంగంలోకి దించుతున్నాడు. అస‌లు ఈ సినిమాకీ బిగ్‌కీ అస్స‌లు సంబంధం లేదు.కానీ తెలివిగా వ‌ర్మ ఓ పోగ్రాం డిజైన్ చేశాడు. దీనికి అక్ష‌రాలా కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు టాక్‌. ‘శివ టూ వంగవీటి’ అనే పేరుతో ఈనెల 20న హైద‌రాబాద్ లో వర్మ ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాడు. శివ త‌న తొలి చిత్రం. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌ర్కార్ 3 తీస్తున్నాడు. ఈ మ‌ధ్య ప్ర‌యాణాన్ని విశ్లేషించే కార్య‌క్ర‌మం అన్న‌మాట‌. ఇందులో నాగార్జున నుంచి అమితాబ్ బ‌చ్చ‌న్ వ‌ర‌కూ వ‌ర్మ‌తో ప‌నిచేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు అంతా పాలు పంచుకోబోతున్నారు. ఈ ఈవెంట్‌లోనే వర్మ త‌న వంగ‌వీటి ప్లాటిన‌మ్ డిస్క్ ఫంక్ష‌న్ చేయ‌బోతున్నాడు. నిజానికి ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం చేప‌ట్టింది వంగ‌వీటి కోస‌మే. అమితాబ్ బ‌చ్చ‌న్ దిగి వ‌చ్చి… వ‌ర్మ గురించి మాట్లాడితే కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ క‌దా. అదీ.. వ‌ర్మ వేసిన మెగా స్కెచ్‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close