కొత్తపలుకు : కేసీఆర్‌ను చూసి జగన్‌ నేర్చుకోవాలంటున్న ఆర్కే..!

సమకాలిన రాజకీయాలపై సమగ్రమైన విశ్లేషణ చేసే.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ “కొత్తపలుకు” ఆర్టికల్ లో ఈ వారం ప్రధానంగా.. కశ్మీర్ పైనే దృష్టి కేంద్రీకరించినప్పటికీ.. ఏపీ రాజకీయాల గురించి… కూడా.. కొన్ని ఆలోచన చేసే కామెంట్లు చేశారు. “కొత్తపలుకు” లో కశ్మీర్ లో..ఇక ఎవరైనా ఆస్తులు కొనొచ్చంటూ.. అక్కడి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చంటూ … విపరీతంగా జరుగుతున్న ప్రచారం.. చేస్తున్న కామెంట్లతో.. కశ్మీరీలో ఆత్మగౌరవం దెబ్బతింటుందని.. అంతిమంగా అది చెడుకే దారి తీస్తుందని.. ఆర్కే విశ్లేషించారు. ఇలాంటివి జరగడం వల్లే.. తెలంగాణ ఉద్యమం వచ్చిందని.. గుర్తు చేశారు. ఆర్టికల్ 370 గురించి… వివిధ రకాల వ్యక్తులు చేస్తున్న కామెంట్లపైనా సునిశిత విమర్శలు చేశారు. మొత్తానికి ఈ పరిణామాలతో.. మోడీ.. గత కాంగ్రెస్ ప్రధానమంత్రుల కన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని మాత్రం.. ఆర్కే తేల్చారు.

కశ్మీర్‌కు ఆంధ్రాకు భలే లింక్ పెట్టిన ఆర్కే..!

కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నేపధ్యంలో.. కశ్మీర్ భూములు, ఉద్యోగాలు, వ్యాపారాల గురించి మాట్లాడుతున్న సమయంలో.. కియా పరిశ్రమ ప్రారంభోత్సవంలో ఓ గొడవ జరిగింది. దాన్నే ఆర్కే.. విశ్లేషించారు. “ఈ భూమి మాది, నీరు మాది, శ్రమ మాది, ఉద్యోగాలు కూడా మాకే” అంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ఎంపీ గోరంట్ల మాధవ్ కియ మోటార్స్ కంపెనీ ప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో.. అంతా మనది అంటున్నవారు.. సొంత రాష్ట్రాలు.. జిల్లాలకు వచ్చే సరికి.. అంతా మాదే అంటున్నారని.. ఆర్కే .. నేరుగానే చెప్పేశారు. బహుశా రాజకీయ పార్టీల వద్ద.. దీనికి సమాధానం ఉండకపోవచ్చు కూడా.

కేసీఆర్‌ను చూసి… జగన్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది..!

కేసీఆర్, జగన్ ఇప్పుడు జిగిరి దోస్తులు. పనులు ఆలస్యం కాకుండా ఉండటానికి కేసీఆర్ నామినేషన్ పద్దతిన పనులు ఇచ్చి.. శరవేగంగా పూర్తి చేసుకుంటూ ఉంటే.. జగన్ మాత్రం.. రద్దుచేసుకుంటూ పోతున్నారని ఆర్కే విశ్లేషించారు. తెలంగాణవాళ్లు, ఆంధ్రావాళ్లు అని చూడకుండా సకాలంలో పని చేయగలిగేవారికి కేసీఆర్ పెద్దపీట వేస్తుండగా, గిట్టనివారు దక్కించుకున్న టెండర్లు అన్నింటినీ జగన్మోహన్‌రెడ్డి రద్దుచేస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న ఈ ధోరణిపై ప్రజల్లో కూడా సందేహాలు నెలకొంటున్నాయని తేల్చారు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ ను చూసి.. జగన్ నేర్చుకోవాలని .. “కొత్తపలుకు” వేదికగా జగన్‌కు ఆర్కే సలహా ఇచ్చారు.

జగన్ పాలన ఫలితాలు ఏపీపై భవిష్యత్‌లో పడతాయా..?

జగన్ పాలన వల్ల ఏపీకి ఇప్పటికిప్పుడు మాత్రమే కాదు..భవిష్యత్‌లోనూ తీవ్రమైన నష్టాలు ఉంటాయని.. ఆర్కే చెప్పుకొచ్చారు. న్యాయ వివాదాలకు దారితీస్తున్న జగన్ ప్రభుత్వ నిర్ణయాల దుష్ప్రభావం మున్ముందు ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని తేల్చారు. పీపీఏల విషయంలోనే దీన్ని ఉదాహరమగా చెప్పారు. రేట్లను తగ్గించడానికి జగన్ ప్రభుత్వ అధీనంలోనే ఉన్న జెన్‌కో కూడా అంగీకరించడం లేదు. అలాంటిది ప్రైవేట్ సంస్థలు ఎందుకు అంగీకరిస్తాయని ప్రశఅనిచారు. మరో ఆరు నెలలపాటు ఇవే పరిస్థితులు కొనసాగితే జగన్మోహన్‌రెడ్డికి ఓటు వేసినవాళ్లు కూడా పశ్చాత్తాపం చెందుతారని తేల్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close