ఆర్కే పలుకు : వచ్చే వారం “అసలు కథ”..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారంతపు ఆర్టికల్ “కొత్తపలుకు” తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ మోస్ట్ వాంటెండ్‌గా మరింది. ఆయన ప్రభుత్వాలకు భయపడకుండా అనేకానేక అంశాలను నిస్సంకోచంగా వెల్లడించడం ఓ కారణం అయితే.. ఆయన ఆర్టికల్లో చెప్పినవి చాలా వరకూ నమ్మదగ్గవే ఉండటంతో విశ్వసనీయత పెరగడం కూడా మరో కారణం అని చెప్పుకోవచ్చు. పూర్తిగా రాజకీయాలకు మాత్రమే పరిమితమవడం.. ఎక్కడా ట్రాక్ తప్పకపోవడంతో ఆయన ఆర్టికల్స్‌కు ఫాలోయర్స్ ఎక్కువే. అందుకే ఆయన దాన్ని మార్కెటింగ్‌కు కూడా వాడుకుంటున్నారు. అయితే ఇది వేరే మార్కెటింగ్ కాదు…తన ఆర్టికల్‌నే మార్కెటింగ్ చేసుకుంటున్నారు.

ఈ వారం ఆర్టికల్‌లో జగన్మోహన్ రెడ్డి – కేసీఆర్ మధ్య లడాయి ఎక్కడ ప్రారంభమైందనే అంశంపై చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు. అదేమిటంటే.. షర్మిల పార్టీ పెట్టడం కేసీఆర్ కు ఇష్టం లేదని.. ఆమెను జగన్ కంట్రోల్ చేయకపోవడం వల్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే.. అంతకు మించి ముందుకెళ్లలేదు..” ఈ వ్యవహారంలో జరగబోయేది ఏమిటి? జరిగింది ఏమిటి? అన్నది వచ్చే వారం చెప్పుకొందాం!..” అని టీజర్ వదలారు. ఇంత నేరుగా ఆర్కేనే చెప్పిన తరవాత వచ్చేవారం ఆర్టికల్ కోసం… అందరూ ఎదురు చూడక తప్పదు. ఎందకుంటే.. ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహం కోసం రాజకీయం చేస్తున్నారా..?నిజంగానే ఇద్దరి మధ్య తేడాలొచ్చాయా అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది.

కేసీఆర్‌తో పెట్టుకుంటే… జగన్మోహన్ రెడ్డికి మైనస్సే. ఎందుంటే.. గత ఎన్నికల సమయంలో ఆయన తెలంగాణ సర్కార్ ను… తన సొంత సర్కార్ అన్నంతగా వాడుకుని.. డేటాచోరీ లాంటి అభూత కల్పనల కేసులు పెట్టించి.. చేయాల్సినంత రగడ చేసి రాజకీయలబ్ది పొందారు. ఇక ఆర్థిక సాయమూ పొందారని ఆర్కే లాంటి వాళ్లు ఆర్టికల్స్‌లోనే చెబుతూ ఉంటారు. అదెంత నిజమో.. ఎవరికీ ఎప్పటికీ తెలియదు. అయితే.. కేసీఆర్‌తో లడాయి మాత్రం.. జగన్‌కు ఖచ్చితంగా మైనస్సేనని చెప్పుకోవచ్చు. అందుకే వచ్చేవారం ఆర్కే చెప్పబోయే ఆంశాలపై ఆసక్తి ఉండటం సహజం.

ఇది తప్పితే మిగతా ఆర్టికల్‌లో గతంలో చెప్పినవే చెప్పారు. నీటి మీద ఇద్దరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. అయితే.. కొంత తేడా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇద్దరూ కూడబలుక్కుని ఈ రాజకీయం చేస్తున్నారని గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు.. కొంత టోన్ మార్చారు. కేసీఆర్ మొత్తంగా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారని.. అది ఆయన హక్కు అన్నట్లుగా టోన్ మార్చి.. జగన్ మాత్ర.. ప్రజాప్రయోజనాలను పట్టించుకోకుండా… కేసీఆర్ రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయంతో ఆర్టికల్ రాసుకొచ్చారు.

మరో వైపు తాను గత వారం రాసిన .. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిగురించిన కొన్ని వాక్యాలపై చెలరేగిన దుమారంపై ఆర్కే.. తన కామెంట్‌లో ప్రత్యేకంగా కొంత భాగాన్ని కేటాయించారు. ఎవరేమన్నా డోంట్ కేర్ అన్నారు. అదే సమయంలో.. తమ నిజాయితీ చెప్పుకోవడానికి ఓ సర్టిఫికెట్‌లాగా వాడుకున్నారు. తమ పై చేసిన ఆరోపణలన్నీ తప్పు కాబట్టి.. ఇప్పటి వరకూ.. చిన్న చర్య కూడా తీసుకోలేకపోయారనితేల్చారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు.. గత ప్రభుత్వంనుంచి వందలు.. వేల కోట్లు… ఆంధ్రజ్యోతికి వెళ్లాయని చెబుతూ ఉంటారు. అదే నిజమైతే.. ఇప్పటికి కేసులు పెట్టడమో.. లేకపోతే.. కనీసం జీవోలు బయట పెట్టడమో చేసేవారు. ఏమీ చేయలేదంటే… ఆర్కే చెప్పేది కరెక్టే్ అనుకోవాలి. ఇలాంటిపరిస్థితుల్ని.. పక్కాగా ఆర్కే.. తన క్రెడిబులిటీని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close