ఆర్ఆర్ఆర్ నిరర్ధకమైన సినిమానా?

అబ్సర్డ్ లిటరేచర్ అని సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ. అబ్సర్డ్ డ్రామా, అబ్సర్డ్ ఫిక్షన్, అబ్సర్డ్ సినిమా, అబ్సర్డ్ హ్యుమర్ ..ఇలా రకరకాలుగా వుంటుంది. తెలుగులో దిని అర్ధం చెప్పాలంటే.. నిరర్ధకమైన (పర్పస్ లెస్, మీనింగ్ లెస్ ) అని వస్తుంది. ఇప్పుడీ అబ్సర్డ్ చర్చ ఎందుకంటే .. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియా నుండి ఆస్కార్ కి వెళుతుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ అవకాశం ఆర్ఆర్ఆర్ కి దక్కలేదు. ఒక గుజరాతీ సినిమాని ఆస్కార్ కి పంపించారు. దీనిపై చాలా మంది పెదవి విరిచారు. ఆర్ఆర్ఆర్ ని ఎందుకు ఆస్కార్ కి పంపించలేదనేది చాలా మంది ప్రశ్న. సినిమాని ప్రేక్షకులు తెగ చూశారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైతే దాదాపు ఎనిమిది వారాలు పాటు వరల్డ్ వైడ్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. కొంతమంది హాలీవుడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. రాజమౌళితో ఇంటర్వ్యూ లు చేశారు. అలాంటి సినిమాని ఆస్కార్ నామినేషన్ కి ఎందుకు పంపలేదనేది ఇప్పుడు ప్రశ్న. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇండియన్ ఆస్కార్ అవార్డ్ జ్యూరీలో జరిగిన ఒక ఆసక్తికరమైన చర్చ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

జ్యూరీ సభ్యుల్లో ఒకతను ఆర్ఆర్ఆర్ సినిమాని అబ్సర్డ్ సినిమాగా వాదించాడట. ఆయన వాదన ఏమిటంటే.. ”ఆర్ఆర్ఆర్ ఒక ఫిక్షనల్ మూవీ. ఫాంటసీ ఫిక్షన్ అనుకుందాం. సినిమా రూపకర్తలు ఇదే డిస్ క్లయిమర్ ఇచ్చారు. చరిత్రని ఫాంటసీ చేశారు. ఫాంటసీ చేసినప్పుడు వ్యక్తులు, స్థలాల పేర్లు కూడా మార్చాలి. కానీ అలా చేయలేదు. ఢిల్లీ, ఆగ్రా, విశాఖపట్నం, లాలా లజపత్ రాయ్, నిజాం, గోండులు ఇలా చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలతోవున్న వ్యక్తులు, స్థలాలు, తెగలు, ప్రాంతాలని వాడారు. వాటి ప్రామాణికమైన చరిత్రకు భిన్నంగా వక్రీకరీంచారు. ఆర్ఆర్ఆర్ అంతా పూర్తి అబ్సర్డిటీ. ఇంతలా చరిత్రని వక్రీకరీంచి చేసిన ఒక అబ్సర్డ్ సినిమాని ఆస్కార్ కి పంపడం అంటే మన చరిత్రని మనమే కించపరుచుకోవడం, అభూత కల్పన చేసుకోవడమే” ఇదీ ఆ సభ్యుని వాదన. ఈ వాదన విన్న మిగతా సభ్యులు కూడా చరిత్రకారులతో ఖచ్చితంగా చిక్కొచ్చే అవకాశం వుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే జ్యూరీ సభ్యుల్లో మరొకతను.. ఆర్ఆర్ఆర్ ని అబ్సర్డ్ సినిమా అనుకుంటే.. అలాంటి సినిమాని ఆస్కార్ కి పంపకూడదనే నిబంధన ఏమైనా ఉందా? అని ప్రశ్నని లేవనెత్తారట. చివరికి జ్యూరీ ఏం తేల్చిందో కానీ ఆర్ఆర్ఆర్ కి మాత్రం నామినేషన్ దక్కలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close