అమరావతిపై రిఫరెండంగా నర్సాపురం ఉపఎన్నిక..!?

అమరావతి విషయంలో అధికార, ప్రతిపక్షాలు రాజకీయంగా ఓ అవగాహనకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజాభిప్రాయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు మూడు రాజధానులు అని చెప్పలేదు కాబట్టి.. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని అంటోంది. ఈ విషయంలో వైసీపీ గట్టిగా ఏమీ చెప్పలేకపోతోంది. అయితే… ఇప్పుడు మరో ఆప్షన్ ఆ పార్టీ ముందుకు వచ్చింది. అదే నర్సాపురం లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక. అమరావతి కోసం రిఫరెండంగా.. ఉపఎన్నికను చూస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటిస్తే.. తాను రాజీనామా చేస్తానని రఘురామకృష్ణరాజు బహిరంగ సవాల్ విసిరారు.

నర్సాపురం ఎంపీపై వైసీపీకి పీకల మీద దాకా కోపం ఉంది. ఆయన ప్రతిపక్ష పార్టీల నేతలను మించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దాంతో ఆయన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తరచూ వినిపిస్తున్నారు. ఇలాంటి డిమాండ్ వినిపించినప్పుడల్లా రఘురామకృష్ణరాజు ఫైర్ అవుతున్నారు. తన ఇమేజ్‌తోనే గెలిచానని.. తన వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారా అని అడుగుతున్నారు. అయితే ఈ సారి మంత్రి బాలినేని విసిరిన సవాల్‌కు.. రఘురామకృష్ణరాజు భిన్నంగా బదులిచ్చారు. పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకే.. తాను అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నానన్నారు. అమరావతిపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి తాను రాజీనామా చేస్తానని నర్సాపురం ఉపఎన్నికను .. రిఫరెండంగా జగన్‌తో ప్రకటింప చేస్తారా అని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం మొత్తం రద్దు చేస్తే ఇబ్బంది అవుతుంది. కానీ రఘురామకృష్ణరాజు సవాల్ ప్రకారం అయితే.. ఒక్క నర్సాపురం నియోజకవర్గంతోనే.. రిఫరెండం పూర్తి చేయవచ్చు. అమరావతిపై మాట మార్చారనే విమర్శలకు.. ప్రజా మద్దతు లేదనే విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లవుతుంది. అయితే.. ఈ విషయంలో వైసీపీ స్పందన ఏమిటో తెలియడం లేదు. ఒక వేళ జగన్.. నిజంగానే.. రఘురామకృష్ణరాజు సవాల్‌కు స్పందిస్తే.. అమరావతి వివాదానికి ఓ లాజికల్ కంక్లూజన్‌ లభించే అవకాశం ఉంటుంది. మరేం చేస్తారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close