ఉస్మానియా వేదిక‌గా ఆర్టీసీ కార్మికుల భారీ బ‌హిరంగ స‌భ‌!

ఆర్టీసీ కార్మికులకు మ‌ద్ద‌తుగా రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాలు శ‌నివారం నిర్వ‌హించిన బంద్ స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి. ప్రైవేట్ కేబ్ డ్రైవ‌ర్లు, ఆటో డ్రైవ‌ర్లు కూడా ఆర్టీసీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే, ప్ర‌భుత్వం త‌మ‌ని చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తే వెంట‌నే వ‌చ్చేందుకు ఇప్ప‌టికీ తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ సంఘాల నేత అశ్వ‌త్థామ‌రెడ్డి అన్నారు. కానీ, ప్ర‌భుత్వం నుంచి అలాంటి సంకేతాలేవీ లేవు. సోమ‌వారం నుంచి విద్యా సంస్థ‌లు కూడా తెర‌వాల్సిన అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి, పెద్ద ఎత్తున సిబ్బందిని రిక్ర్యూట్ చేసుకుని బ‌స్సులు తిప్పాల‌నే ఆలోచ‌నలోనే ఉన్నారు. అవ‌స‌ర‌మైతే వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో డ్రైవ‌ర్లుగా ప‌నిచేస్తున్న‌వారి సేవ‌ల్ని వినియోగించుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కూ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌నా ఉండే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. నిజానికి.. ప్ర‌భుత్వం అనేకంటే, ఈ స‌మ్మెకు సంబంధించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక్క‌రే తెర మీదున్నారు. ఇత‌ర మంత్రులుగానీ, అధికారులుగానీ ఆయ‌న ఆదేశాల్ని మాత్ర‌మే పాటిస్తున్న ప‌రిస్థితి.

బంద్ స‌క్సెస్ కావ‌డంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను ఇవాళ్ల ప్ర‌క‌టించ‌బోతున్నాయి. రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించి, ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచే కార్య‌క్ర‌మాల‌ను ఇవాళ్ల ప్ర‌క‌టిస్తామ‌న్నారు. దీన్లో భాగంగా ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఈ నెల 23న భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ స‌భ‌కు పెద్ద ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణ చేసేందుకు రాజ‌కీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయ‌నీ, ఆయా పార్టీల జిల్లాల నేత‌ల‌తో పార్టీ రాష్ట్ర నాయ‌కులు ఇప్ప‌టికే చ‌ర్చించార‌నీ స‌మాచారం.

రెండోసారి కేసీఆర్ సీఎం అయిన త‌రువాత ఆయ‌న‌కి వ్య‌తిరేకంగా ఇలాంటి భారీ నిర‌స‌న స‌భ జ‌ర‌గ‌డం ఇదే ప్ర‌థ‌మం అవుతుంది. ప్ర‌తిప‌క్షాల‌కు కూడా బాగానే ప‌ట్టు ఉంది అనే అభిప్రాయం క‌లిగించే అవ‌కాశం ఈ స‌భ‌తో వ‌స్తుంది. అందుకే, విప‌క్ష పార్టీల‌న్నీ ఈ స‌భ‌ను సీరియ‌స్ గానే తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. 23న హైద‌రాబాద్ లో స‌భ‌, రాష్ట్ర‌వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర బంద్ స‌క్సెస్ కావ‌డం కేసీఆర్ కి కొంత మైన‌స్ అయ్యే అంశ‌మే. ఇప్పుడు హైద‌రాబాద్ లో నిర‌స‌న స‌భ అంటే… రాజ‌కీయంగా అది కూడా కొంత ఇబ్బందిక‌ర‌మైందే అవుతుంది. దీన్నెల్లా తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close