దావూద్ ఇబ్రహీం మళ్లీ చచ్చిపోయాడు..!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీ మళ్లీ చచ్చిపోయాడు. ఆయన చనిపోయాడనే సంబరాల్ని ఇండియాలో కొంత మంది సోషల్ మీడియాలో చేసేసుకున్నారు. ఆయన మళ్లీ తాను ఉన్నానని నిరూపించేందుకు ఏదో ఒకటి చేసే వరకూ.. ఆయన చచ్చిపోయాడనే సంబరాలు చేసుకుంటారు. ఎలా వచ్చిందో..? ఎందుకు వచ్చిందో తెలియదు కానీ… హఠాత్తుగా సోషల్ మీడియాలో దావూద్ ఇబ్రహీం కరోనాతో చచ్చిపోయాడు.. పాకిస్థాన్‌లోనే అంత్యక్రియలు చేసేశారని.. చెప్పుకోవడం ప్రారంభించారు. కొన్ని టీవీ చానళ్లు కూడా వేసేశాయి. కానీ ఎక్కడా అధికారిక.. ధృవీకరణ సమాచారం లేదు. కానీ.. అండర్ వరల్డ్ డాన్ ఎట్టకేలకు చచ్చిపోయాడని.. అది తమ ఘనతేనన్నట్లుగా కొంత మంది క్రెడిట్ తీసుకుని ప్రచారం ప్రారంభించారు.

దావూద్ ఇబ్రహీంను… ఇప్పటికి అనేక సార్లు ఇలా చంపేశారు. ఓ సారి గ్యాంగ్ వార్‌లోనే చనిపోయారని.. మరో సారి కిడ్నీలు ఫెయిలయ్యాయని..మరోసారి పెరాలసిస్ వచ్చిందని.. మరోసారి మల్టిఫుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని.. చెప్పుకున్నారు. ఏదీ నిజం కాదు. అయితే.. ఆయన అండర్ వరల్డ్ కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నాయని మాత్రం చాలా మంది నమ్ముతూ ఉంటారు. పాకిస్థాన్ క్రికెట్ జావెద్ మియాందాద్ స్వయంగా దావూద్ వియ్యంకుడు. చాలా మంది క్రికెటర్లకు ఆయన ఆప్తుడు. ఆయన ఖచ్చితంగా పాకిస్థాన్‌లోనే ఉన్నారని భారత అధికారవర్గాలు నమ్ముతూ ఉంటాయి. కానీ.. నిజమేంటో మాత్రం అధికారికంగా తెలియదు.

ఒక్క దావూద్ ఇబ్రహీంనే కాదు.. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్‌ల విషయంలో చాలా సార్లు ఇలా చంపేశాం.. చచ్చిపోయాడు.. అనే ప్రకటనలు వచ్చాయి కానీ.. తర్వాత వారు.. తమ ఉనికిని బహిరంగంగా చాటారు. ఇప్పుడు దావూద్ మృతి వార్త నిజం అవుతుందో.. లేకపోతే.. మళ్లీ దావూద్ .. తన మార్క్ అండర్ వరల్డ్ ఆపరేషన్‌తో బయటకు వస్తారో చూడాలి..! . సోషల్ మీడియాలో ఎక్కువమంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దావూద్ మళ్లీ బతికి వస్తాడు చూడండి అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close