రాజమౌళి- చరణ్‌-తారక్‌ సినిమా పై తెగ రూమర్లట!!!

రాజమౌళి పిక్ పోస్ట్ చేసినప్పటినుంచీ సినీ అభిమాను ల్లో సంబరాలు మొదలయ్యాయి. కానీ ఎక్కడో ఏదో డౌట్. ఈ సినిమా ఉంటుందా లేక అది జస్ట్ ఒక ఫోటోనా అని. కానీ సాయి ధరం తేజ్ ఈ సినిమా ఉంటుందని కన్ ఫర్మ్ చేసేసాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి తెగ రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఆ రూమర్లలో కొన్ని ఇవి –

  • – పేరుకి మల్టీ స్టారరే అయినా ఒకరే మెయిన్ హీరో, ఇంకొకరిది ప్రత్యేక పాత్ర అట.
  • – కాదు కాదు, ఇద్దరిదీ సమాన ప్రాముఖ్యత ఉన్న పాత్రలే, ఇద్దరికీ సమానంగా స్క్రీన్ – టైం, ఎలివేషన్ సీన్స్ క్రియేట్ చేయడానికే రాజమౌళికి ఇంకా టైం కావాలట
  • -ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపిస్తారట.
  • – బాక్సింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుందట
  • – ఇందులో చరణ్‌, తారక్‌ స్వయంగా బాక్సర్లుగా కన్పించనున్నారట.
  • – విజయేంద్రప్రసాద్ ఇప్పటికే స్టోరీలైన్ ఫిక్స్ చేశాడట.
  • – ఆ స్టోరీలైన్ ను చెర్రీ, తారక్ కు రాజమౌళి వివరించాడట..
  • – లేదు లేదు, రాజమౌళి ఇంకా స్టోరీ చెప్పనే లేదట. రాజమౌళి అడిగేసరికి స్టోరీ వినకుండానే, ఇద్దరూ ఓకే చెప్పార్ట..
  • -అసలు భజరంగీ భాయి జాన్ టైం లో సల్మాన్, షారుఖ్ ఇద్దరికీ సూటయ్యే మల్టీ స్టారర్ కథని విజయేంద్ర్ ప్రసాద్ వ్రాసాట్ట. అది వర్కౌట్ కాకపోవడం తో దాన్నే కొంచెం మార్చి, చరణ్, తారక్ తో తీస్తున్నార్ట.
  • – నెగటివ్ ఛాయలున్న షారుఖ్ పాత్ర తారక్ కి, పాజిటివ్ సల్మాన్ పాత్ర చరణ్ కీ వచ్చిందట.
  • – బడ్జెట్ 150 కోట్లట..కాదు కాదు 180 కోట్లట.
  • – పారితోషికాలకే అటుఇటుగా వందకోట్లు అవుతుందిట

ప్రతీ రూమర్ లోనూ “అట” “అట” అంటూన్న ఈ గుసగుసలన్నీ ఇటీవల సోషల్ మీడియలో, ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. రాజమౌళి నోరు తెరిచి చెప్పేంత వరకూ ఇవన్నీ “అట” స్థాయి లో మిగిలిపోయేవే. ఆయన అఫీషియల్ గా ఏదైనా చెప్పేంతవరకూ కొత్త కొత్తవి ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.