ముద్దుల రుచి మ‌రిగాడా…??

కార్తికేయ‌… ‘ఆర్‌.ఎక్స్ 100’ విడుద‌లైనంత వ‌ర‌కూ ఆ హీరో గురించి ఎవ్వ‌రికీ తెలీదు. అంత‌కు ముందు ఓ సినిమా చేశాడు గానీ, జ‌నం ఆ సినిమానీ, అందులో న‌టించిన కార్తికేయ‌నీ అస్స‌లు ప‌ట్టించుకోలేదు. కానీ ఒక్క‌సారిగా ‘ఆర్‌.ఎక్స్ 100’తో టపాసులా పేలాడు కార్తికేయ‌. ముద్దుల మ‌హ‌త్మ్య‌మో, క‌థా బ‌ల‌మో, క‌థా నాయిక పాత్ర‌ని చిత్రీక‌రించిన విధాన‌మో.. ఏదైతేనేం ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ర‌ఫ్ఫాడించేసింది. ఒక్క‌సారిగా కార్తికేయ‌కు ఫేమ్ వ‌చ్చేసింది. సినిమాకి కోటి రూపాయ‌లు ఇచ్చి క‌థానాయ‌కుడిగా బుక్ చేసుకోవ‌డం మొద‌లెట్టారు. అలా వ‌చ్చిన క‌థ‌ల్లో చాలా మ‌ట్టుకు జ‌ల్లెడ ప‌ట్టి ‘హిప్పీ’ అనే సినిమాని ఎంచుకున్నాడు.

ఈ సినిమా కోసం కార్తికేయ కాస్త క‌స‌ర‌త్తు చేసిన‌ట్టే క‌నిపించింది. బాడీ బిల్డ‌ప్ చేశాడు. హెయిర్ స్టైల్ మార్చాడు. కొత్త గెట‌ప్‌లోకి దూరాడు. అయితే ఇప్పుడొచ్చిన టీజ‌ర్ చూస్తే… ‘ఆర్‌.ఎక్స్ 100’ ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేదేమో అనిపిస్తోంది. ఇందులో ప్లేబాయ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు కార్తికేయ‌. 30 సెక‌న్ల టీజ‌ర్లో రెండు ఘాటు ముద్దులు క‌నిపించాయి. ఆర్‌.ఎక్స్ 100లో ఇలాంటి ముద్దుల‌కైతే లెక్కేలేదు. టీజ‌ర్లోనే రెండు వ‌దిలాడంటే… సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో..? మొత్తానికి కార్తికేయ ముద్దుల రుచి మ‌రిగాడేమో అనిపిస్తోంది. ముద్దులతో పాటు, పాత్ర‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌, పాత్ర‌లో వైవిధ్యం, క‌థ‌లో ద‌మ్మూ ఉంటే… ‘హిప్పీ’ హిట్ట‌వ్వ‌డం ఖాయం. మ‌రి అవ‌న్నీ ఉన్నాయో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com