ఆర్ఎక్స్‌100… విజయ్ దేవరకొండకి చెప్పిన కథ!

‘అర్జున్‌రెడ్డి’ తరవాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ట్రైలర్ ఏదైనా వుందంటే అది ‘ఆర్ఎక్స్‌100’ సినిమా ట్రైలరే. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ జంటగా నటించిన ఈ సినిమాతో రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్లను చూస్తే ఇందులో హీరో కార్తికేయ పాత్ర ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్ దేవరకొండ పాత్ర తరహాలో అగ్రెస్సివ్‌గా వుంది.

ఇంకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఏంటంటే… ‘ఆర్ఎక్స్‌100’ కథ ముందు విజయ్ దేవరకొండ దగ్గరకే వెళ్ళింది. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ “మూడేళ్ళ కక్రితం నేను విజయ్ దేవరకొండను కలిశా. అప్పటికి ‘పెళ్లి చూపులు’ షూటింగ్ మొదలు కాలేదు. మరో రెండు నెలల్లో మొదలవుతుందని అనగా నేను వెళ్లి కలిశా. నేను మొట్టమొదటిగా కథ చెప్పింది కూడా అతనికే. కథ నచ్చిందన్నారు కానీ… ‘పెళ్లి చూపులు’ తరవాత కలుద్దామన్నారు. చివరకి నేను కొత్త వాళ్ళతో తీశా” అన్నారు.

ట్రైలర్‌లో హీరో క్యారెక్టర్ అగ్రెస్సివ్ వుందని ‘అర్జున్‌రెడ్డి’తో తమ సినిమాను కంపేర్ చేయవద్దని అజయ్ భూపతి తెలిపాడు. “అర్జున్‌రెడ్డి’ తూర్పు అయితే… తమది పడమర” అని వ్యాఖ్యానించాడు. ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.