తేజూ – మారుతి.. క‌థ రెడీ కాలేద‌ట‌!

చిత్ర‌ల‌హ‌రి త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ – మారుతి క‌ల‌సి ఓ సినిమా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించబోతోంద‌ని కూడా అనుకుంటున్నారు. సాయి తో మారుతి సినిమా, అది గీతా ఆర్ట్స్ లో నిర్మించ‌డం ఖాయ‌మే. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థే సెట్ కాలేదు. తేజూ కోసం మారుతి క‌థ‌లు సిద్దం చేస్తున్నాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ సాయికి ఒక్క క‌థ కూడా వినిపించ‌లేద‌ని తెలుస్తోంది.

ఏప్రిల్‌లో చిత్ర‌ల‌హ‌రి విడుద‌ల కానుంది. ఆ సినిమా ఫ‌లితాన్ని బ‌ట్టే తేజూ చేయ‌బోయే త‌దుప‌రి సినిమా ఏమిట‌న్న‌ది తేల‌బోతోంది. మారుతి ద‌గ్గ‌ర బౌండెడ్ స్క్రిప్ట్ అంటూ ఏదీ లేదు. కేవ‌లం కొన్ని లైన్స్ మాత్ర‌మే ఉన్నాయి. వాటిని డ‌వ‌ల‌ప్ చేస్తున్నాడు. ఏ కొత్త క‌థైనా స‌రే.. చిత్ర‌ల‌హ‌రి విడుద‌ల త‌ర‌వాతే వింటాన‌ని తేజూ చెప్పేశాడ‌ట‌. మారుతి కూడా ఏమాత్రం కంగారు ప‌డ‌డం లేదు. చిత్ర‌ల‌హ‌రి చూశాక‌… అప్పుడు సాయి కోసం ఏ లైన్ అయితే బాగుంటుందో, డిసైడ్ చేస్తాడ‌ట‌. అంటే మారుతి ఎలాంటి క‌థ‌తో వ‌స్తాడ‌న్న‌ది చిత్ర‌ల‌హ‌రినే డిసైడ్ చేస్తుంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close