మరో మెగా సాంగ్ రీమిక్స్ అట

మెగా ఇమేజ్ ని కరెక్ట్ గా వాడుకుంటూ అతి తక్కువ టైంలోనే లైం లైట్లోకి వచ్చాడు సుప్రీం హీరో సాయి ధరం తేజ్. రీసెంట్ గా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న మెగా మేనళ్లుడు తన తర్వాత సినిమా సుప్రీంకు షురూ చేశాడు. పటాస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వం చేస్తున్న సుప్రీం సినిమాను శ్రీ వెంకటేశ్వర సిని క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే రేయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో సాయి మెగాస్టార్ సాంగ్ ని రీమిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.

అయితే ప్రస్తుతం తను చేస్తున్న సుప్రీం సినిమాలో కూడా యముడికి మొగుడు సినిమాలోని ‘సుప్రీం హీరో..’ సాంగ్ ని రీమిక్స్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. మెగా ఇమేజ్ వద్దు వద్దంటూనే మామ సినిమాలోని సాంగ్స్ ని వాడుతూ హిట్టు మీద హిట్టు కొడుతున్న సాయిని చూసి కుర్రాడు మాంచి స్పీడ్ మీదున్నాడే అని అనుకుంటున్నారంతా. అంటే మనోడికి అన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. తీసిన మూడు సినిమాలకే మెగా అభిమానులకు దగ్గరయ్యాడు.

మెగాస్టార్ కూడా సుప్రీమ్ సినిమాలో తన సాంగ్ వాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. హాట్ గాళ్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మరోసారి మెగా అభిమానులను ఆకట్టుకునేలా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు సాయి ధరం తేజ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close