నిహారిక నాకు చెల్లెలు లాంటిది: సాయిధ‌ర‌మ్ తేజ్‌

ఈరోజు ఓ వార్త‌.. టాలీవుడ్ మొత్తం షికారు చేస్తోంది. సాయిధ‌ర‌మ్‌తేజ్‌కీ, నిహారిక‌కూ పెళ్ల‌నేది ఆ గాసిప్ సారాంశం. కాస్త తీగ దొరికితే… దాన్నిప‌ట్టుకొని ఇల్లు క‌ట్టేసే ర‌కం క‌దా… టాలీవుడ్‌లో గాసిప్ రాయుళ్ల వ్య‌వ‌హారం. తేజూ – నిహారిక ఈమ‌ద్య కాస్త ట‌చ్‌లో ఉండ‌డం చూసి, ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో ఉంద‌ని, అది ల‌వ్వేన‌ని, ఈ లవ్ మేట‌ర్ ఇంట్లోవాళ్ల‌కూ తెలిసిపోయింద‌ని, ఎలాగూ బంధుత్వం ఉంది కాబ‌ట్టి.. మెగా ఫ్యామిలీ వీళ్లిద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని డిసైడ్ అయిపోయింద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వండేసుకొంటున్నారు. అయితే.. ఈ పెళ్లి మేట‌ర్ అంతా ఉత్తిదేన‌ట‌. అస‌లు తేజూ – నిహారిక మ‌ధ్య ల‌వ్ అన్న‌దే పెద్ద జోక్ అని సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌ర్స‌న‌ల్ పీఆర్ఓ కుండ‌బ‌ద్దలు కొట్టేశాడు. ”తేజూ, నిహారిక మ‌ధ్య ఏదో ఉంద‌ని వార్త‌లొస్తున్నాయి. దానంత జోక్ మ‌రోటి లేదు`”అని కొట్టి ప‌రేశాయి పీఆర్వో వ‌ర్గాలు. ఈ విష‌యంపై తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా స్పందించాడు. ”ఈ వార్త‌లు నిజం కావు. నిహారిక నాకు చెల్లెలు లాంటిది” అంటూ కొట్టి ప‌రేశాడు.

సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌హా గ‌డ‌స‌రి. నాలుగు సినిమాలు చేశాడో, లేదో… రెండు మూడు ల‌వ్ మేట‌ర్ల‌లో ఇన్‌వాల్వ్ అయిపోయాడు. టాలీవుడ్‌లోని ఓ ప్ర‌ముఖ క‌థానాయిక‌తో మ‌నోడు డేటింగ్‌లో ఉన్నాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లొస్తున్నాయి. ఈవిష‌యంలో అల్లు అర‌వింద్ ఓసారి తేజూపై సీరియ‌స్ అయ్యార‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. అయినా స‌రే.. ఆ క‌థానాయిక‌తో చ‌నువుగా ఉండ‌డం మాన‌లేద‌ట‌. ఇప్ప‌టికీ తేజూ గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌న డేటింగ్ వ్య‌వ‌హారం న‌డిపేస్తున్నాడ‌ని తెలుస్తోంది. అలాంట‌ప్పుడు నిహారిక‌ని తేజూకి ఇచ్చి పెళ్లి ఎందుకు చేస్తారు..? ఈ చిన్న లాజిక్ ఆలోచిస్తే…. ఈ గాసిప్ అస‌లు పుట్టేదే కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com