రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ కోసం బుర్రా సాయిమాధ‌వ్

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు అందించ‌బోతున్నారు. ఓ వైపు `సైరా`, మ‌రోవైపు `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌ల సినిమాలకు బుర్రా మాట‌లు అందిస్తూ బిజీగా ఉన్నారు. ఈలోగా మ‌రో సూప‌ర్ ఛాన్స్ వ‌చ్చేసింది. ఇటీవ‌ల ఎగ్రిమెంట్లు కూడా కుదిరాయ‌ని, త్వ‌ర‌లో ఈ సినిమా డైలాగ్ వెర్ష‌న్‌ని బుర్రా సాయిమాధ‌వ్ ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది. `బాహుబ‌లి` కోసం కూడా మొద‌ట బుర్రానే సంప్ర‌దించారు. అయితే అప్ప‌ట్లో త‌న‌కున్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల `బాహుబ‌లి` ప్రాజెక్టుని వ‌దులుకోవాల్సివ‌చ్చింది. ఈసారి రాజ‌మౌళి ఏరికోరి మ‌రీ బుర్రాని తీసుకున్నారు. ఈసారి మాత్రం బుర్రా ఈ అవకాశాన్ని వ‌దులుకోలేదు. ఈ ద‌స‌రాకి ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించే అవ‌కాశాలున్నాయి. ఈ యేడాది చివ‌ర్లో సెట్స్‌పైకి వెళ్లొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com