సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆయన స్క్రిప్టులు, ప్లాన్లు అన్నీ రివర్స్ అవుతున్నాయి. జగన్మోనహ్ రెడ్డిని జోకర్ చేస్తున్నాయి. అదే సమయంలో జగన్ రెడ్డిని పార్లమెంట్ లో రేణకాచౌదరి ఘోరంగా తిడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి నేరుగా ట్వీట్ చేయడం కోటరీకి షాక్ తగిలినట్లయింది. ఎందుకు స్పందించలేదో కానీ.. ఇప్పుడు ఎందుకైనా మంచిదని సజ్జల ప్రెస్మీట్ పెట్టారు.
జగన్ రెడ్డి ఆలోచన మావిగన్ ఎంతో గొప్పదని చెబుతారని అందరూ అనుకున్నారు కానీ ఆయన రేణుకాచౌదరి వ్యాఖ్యలను వింతైన భాష్యంతో ఖండించే ప్రయత్నం చేశారు. రేణుకా చౌదరి గతంలో వైసీపీ వాళ్లు అమరావతికి కమరావతి అని పేరు పెట్టి విమర్శలు చేసిన విషయాన్ని ప్రస్తావించి ఇప్పుడు అనమని సవాల్ చేశారు. అయితే దీన్ని సజ్జల మరో రకంగా చెప్పారు. అమరావతికి కులాన్ని అంటించే ప్రయత్నాన్ని టీడీపీ చేసిందట.. రేణుకాచౌదరి అంటిచారట. ఇదంతా ఎందుకంటే.. రేణుకాచౌదరిని ఏమీ అనకపోతే.. జగన్ రెడ్డికి కోపం వస్తుంది. అందుకే ప్రెస్మీట్ పెట్టారు.
మూడు రాజధానులపై కూడా యూటర్న్ తీసుకోవడాన్ని ఎలా సమర్థించుకోవాలో సజ్జలకూ తెలియడం లేదు. మావిగన్ గురించి ఆయన కూడా మాట్లాడటం లేదు. విసారెడ్డిని జగన్ రెడ్డి ఎప్పుడు మళ్లీ పిలిచి తమ నెత్తి మీద కూర్చోబెడతారో అని సజ్జల భయపడుతున్నారు. అందుకే ఆయన పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోతోంది.


