“కుట్ర” సిద్ధాంత నిపుణుడు సజ్జల !

మాకు ఏదైనా వ్యతిరేకంగా జరిగితే అది కుట్ర. ఆ కుట్ర వెనుక ఎవరున్నారో తేలాలి..ఇదే సేమ్ డైలాగ్ చెబుతూ చెబుతూ వస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ని సార్లు చెప్పినా సిగ్గుపడటం లేదు. నేరుగా సాక్ష్యాలతో కళ్ల ముందు కనిపిస్తున్నా అదే మాట చెబుతారు. వైసీపీలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఓ కుట్ర సిద్ధాంత నిపుణుడిగా క్యాడర్ భావిస్తున్నారు. తాజాగా సీబీఐ .. వివేకా హత్య కేసు అఫిడవిట్‌లో జగన్ పేరు ప్రస్తావించడంపైనా సేమ్ డైలాగ్ చెప్పారు. ఇదంతా కుట్ర అని ఆ కుట్ర వెనుక ఎవరున్నారో తేలాలన్నారు.

మొత్తంగా కేంద్రం దగ్గర మెడలు వంచేసుకుని.. ఏపీ ప్రయోజనాలను పూర్తిగా తాకట్టుపెట్టేసిన తర్వాత కూడా సీబీఐ ఇలా చేస్తోదంంటే.. వారిని పై స్థాయి వారు కూడా కాపాడలేనంత లోతుకు దిగజారిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసో లేదో కానీ.. అటు బీజేపీని విమర్శించలేక..సీబీఐని టీడీపీకి అంటగట్టి కుట్ర సిద్ధాంతాలు చెప్పి.. తన అహన్ని చల్లార్చుకుంటున్నారు. కానీ ఆయనకూ తెలుసు..ఈ కుట్ర సిద్ధాంతాలు కాపాడలేవని.. ఇప్పటికే అటు జనాల్లోనూ..ఇటు సీబీఐకి కూడా ఓ క్లారిటీ వచ్చేసిందని అర్థం అవుతోంది.

ఎప్పుడూ కుట్రలు గురించి మాట్లాడే సజ్జలే అసలు కుట్రలు చేయడంలో నెంబర్ వన్. తమకు ఏదైనా తేడా జరుగుతోందని తెలిస్తే ఓ టీడీపీ లీడర్ ఇంట్లో తలుపులు పగులగొట్టి మరీ అరెస్ట్ చేయమని సీఐడీని పంపిస్తారు.లేకపోతే చంద్రబాబు ఇంటిని జప్తు చేశామని పనికి మాలిన నోటీసులు జారీ చేసి కూలి మీడియాలో బ్రేకింగ్ లు వేసి..హడావుడి చేస్తారు. చివరికి చేసేదేమీ ఉండదు.

గత నాలుగేళ్లుగా అధికారం చేతిలో ఉందని.. లెక్కలేనన్ని కుట్రలకు పాల్పడి రాష్ట్రాన్ని నాకించేసి.. విపక్ష నేతలను వేధించేసి.. తాము అధికారంలోకి రావడానికి బలిచ్చిన వ్యవహారంలో ఇరుక్కుపోతూంటే.. ఇప్పుడు తమపై కుట్ర చేస్తున్నారని సజ్జల అంటున్నారు. చివరికి అందరి బండారం బయటపడినా అదే చెబుతారు. ఎందుకంటే మొత్తంగా సలహాలతో నిండా ముంచేస్తోంది ఆయనే మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close