“నిరుద్యోగ భృతి”పై సాక్షి మార్క్ జర్నలిజం..! ఏపీలో అంతా నిరుద్యోగులేనట…!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అసువుగా చెప్పేస్తూంటారు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్లు.. అదే గోడు వెళ్లబోసుకుంటూ ఉంటారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి తాము రోడ్డున పడ్డామని.. వేదన చెందుతూ ఉంటారు. ఒక్కరంటే.. ఒక్కరికి ఉద్యోగాలు లేవని చెబుతూంటారు. పొల్లు పోకుండా సాక్షి కూడా అదే చెబుతుంది. వారు చెప్పినట్లుగా కాకుండా.. తనకు తాను నిర్ధారంచి రాసేస్తోంది. దీనికి నేటి దినపత్రిక మరో ఉదాహరణ. ప్రభుత్వం నిరుద్యోగభృతిని ప్రకటించింది. అందులో కచ్చితంగా లోపాలెంచాలన్న ఉద్దేశంతో.. రాష్ట్రం కోటి డెభ్బై లక్షల మంది నిరుద్యోగలున్నట్లు తేల్చేసింది. వీరిలో కేవలం 12 లక్షల మందికే భృతి ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. చంద్రబాబు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారని సాక్షి పత్రిక తేల్చేసింది.

ఏదైనా ఓ కథనం రాసేముందు అది లాజిక్‌లకు అందుతుందా లేదా అన్న విషయాన్ని .. జర్నలిస్ట్ తర్కించుకుంటాడు. ఏ చిన్న అనుమానం వచ్చినా… క్రాస్ చెక్ చేసుకుటారు. కానీ సాక్షిలో అలాంటి పరిస్థితి ఏమీ లేనట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్లు. అందులో ఆరేళ్లలోపు ఉన్న వారు 52 లక్షల మంది. ఆరు నుంచి 13 ఏళ్ల లోపు ఉన్న వారు మరో 30 లక్షలు. ఈ రేషియా ప్రకారం చూసుకున్న… ప్రభుత్వం నిర్ణయించిన 22 – 35 ఏళ్ల యువత కేటగిరిలో… కోటి 70 లక్షల మంది వచ్చే అవకాశం లేదు. కనీసం కోటి మంది అటూ ఇటూగా ఉంటారు. సరే ఉన్నారనుకున్నా.. ప్రభుత్వం నిర్ణయించిన యువత కేటగరిలోకి వచ్చిన వారందరికీ.. డిగ్రీలు, డిప్లొమోలు చదివి ఉంటారా..? అన్నది కూడా ఆలోచించలేపోయారు. సరే… అందరూ చదివారనుకున్నా.. ఎవరూ ఏ పనీ , పాటా లేకుండా గడిపేస్తున్నారని ఎలా నిర్ణయించేస్తారు..?.

సాక్షి పత్రిక తాపత్రయమంతా.. యువతను ఎలాగోలా రెచ్చగొడదామనే తప్ప..మరోకటి కాదు. ఆంధ్రప్రేదశ్ జనాభా, వారిలో యువత.. నిరుద్యోగులు ఇలాంటి అంశాలపై కావాలంటే.. క్షణాల్లో సమాచారం ఇచ్చే వ్యవస్థ సాక్షికి ఉంది. కానీ నిజాల్ని మరుగు పరిచి.. గాలి కబుర్లతో… యువతలో ఏదో ఆందోళన తెచ్చి పెట్టాలనే ఏకైక ఉద్దేశంతోనే.. సాక్షి ఈ కథనం రాసిందనేది స్పష్టం. ఇది సాక్షి మార్క్ జర్నలిజం విలువలు అనుకోవాలేమో..? పత్రిక అనేది పాఠకులకు నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. అబద్దాలు చెప్పకూడదు. దురదృష్టవశాత్తూ.. సాక్షి పత్రిక అబద్దాలు మాత్రమే చెబుతోంది. జర్నలిజం విలువలకు సరికొత్త భాష్యం నిర్వచిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close