పాఠకుడంటే సాక్షికి ఎంత లోకువో..! కేసులంటే భ‌యం ఎవ‌రికి..?

రాజ్య‌స‌భ డెప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక‌ల్ని త‌మ ప్ర‌చారానికి వాడుకునే ప్ర‌య‌త్నం వైకాపా చేస్తోంది..! రాష్ట్రాన్ని గాలికి వ‌దిలేసి, ద్రోహం చేసిన పార్టీకి ఏపీ అధికార పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చింద‌నీ, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాంగ్రెస్ కు తాక‌ట్టు పెట్టేసింద‌నీ, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కేసుల భ‌యం ప‌ట్టుకుందంటూ… ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌త్రిక సాక్షి గ‌గ్గోలు పెడుతూ క‌థ‌నాలు వండి వార్చేసింది.

కేసుల భయం ఉంటే.. ఎవరైనా బీజేపీకి మద్దతిస్తారు కానీ… కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకిస్తారబ్బా..?. అవినీతి ఆరోపణలు, కేసుల నుంచి రక్షణ కోసం.. ఎవరైనా ప్రతిపక్ష పార్టీకి మద్దతిచ్చే సాహసం చేస్తారా..?. ఈ ఒక్క చిన్న లాజిక్ కచ్చితంగా పాఠకుల మనసుల్లోకి వెళ్తుందని… ఎందుకు ఊహించలేకపోయింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టబోతోందని.. సాక్షి నిర్ణయించేసుకుందా..? కేసులుంటే జాతీయ పార్టీల అండ కావాలనే సూత్రీకరణ, జగన్ అనుభవాల్లోంచి తెలిసిన ప్రాసెస్ గా మాట్లాడుతున్నట్టుగా లేదూ..? కేసులు ఉన్న‌ది ఎవ‌రిపై… ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుల ముందు విచార‌ణ‌కు వెళ్తున్నంది ఎవ‌రు… కేసులు ఉన్నాయ‌న్న భ‌యంతోనే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయేకి మ‌ద్ద‌తు ఇచ్చింది ఎవ‌రు..? ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ త‌ర‌చూ చెప్తున్న మాట‌ను గుర్తు చేసుకోవాలి… దొంగే, దొంగా దొంగా దొంగా అని అరుస్తున్న‌ట్టుగా లేదా..? నేషనల్ హెరాల్డ్ లాంటి కేసుల్లో రాహుల్, సోనియాలే… కేసుల బారిన పడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారు .. చంద్రబాబుపై కేసుల నుంచి ఎలా రక్షిస్తారు..? నిజంగా అలాంటి కేసులో ఉంటే… ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబును వదిలి పెడుతుందా..?.

ఎంపీల రాజీనామాలు దేనికీ ప‌నికి రాలేదు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ కామెంట్లు వ్య‌తిక‌త‌ను పెంచాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లూ నెగెటివ్ అయ్యాయి. ఇలాంటి వ‌రుస ప‌రిణామాల‌తో వైకాపా క్యాంపులో కొంత సందిగ్ధం ఏర్ప‌డింది. దీంతో మ‌ళ్లీ ఏదో ఒక కొత్త అంశాన్ని ఎత్తుకుని… టీడీపీని దోషీగా నిల‌బెట్టాల‌నే ఆత్రంలో ప‌డుతున్న తాప‌త్ర‌య‌మే ఈ క‌థ‌నాలు. కానీ, వాస్త‌వాలు అంద‌రికీ అర్థ‌మౌతూనే ఉన్నాయి. పార్లమెంటు నుంచీ పారిపోవడం, రాజ్యసభలో ఎన్నిక జరిగితే భాజపాకి వ్యతిరేకంగా ఓటెయ్యకుండా పారిపోవడమే వైకాపా పోరాటమా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close