జీతాల పెంపు చాలదని సాక్షి ఉద్యోగుల సమ్మె..!

అంచనాలు ఎక్కువైపోతే సినిమా అట్టర్ ఫ్లాపవుతుంది. సినిమా బాగున్నా… అది అంచనాలను అందుకోవడం కష్టం కాబట్టి.. ఎంతో ఊహించుకున్న వారు..”ప్చ్ ” అనేస్తారు. చివరికి అది డిజాస్టర్ గా మారిపోతుంది. ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ సీఎం.. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో అలాంటి పరిస్థితే ఉంది. ఎంతో ఊహించుకున్నామని.. పెంచిన జీతం సరిపోదని… ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తూ.. సాక్షి ఉద్యోగులు … ఆందోళన బాట పట్టారు. మీడియా వర్గాల్లో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. సాక్షి పత్రికలో గత మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వైసీపీ గెలిస్తే.. జగన్ సీఎం అయితే.. మూడేళ్ల ఇంక్రిమెంట్ కన్నా.. ఎక్కువ ఇస్తామని యాజమాన్యం చెబుతూ వచ్చింది. జగన్ గెలుపు కోసం ఉద్యోగులంతా ఎదురు చూశారు.. ఆ క్షణం రానే వచ్చింది.

వారికి చెప్పినట్లుగా జీతం కూడా పెంచారు. కానీ ఆ పెంచిన జీతం.. వారి అంచనాలను అందుకోలేదు. ఎంతో పెంచుతారని.. ఆశించిన ఉద్యోగులకు… కేవలం 6.5 శాతం మాత్రమే పెంచడమే.. హతాశులయ్యారు. ప్రతి ఒక్కరిలోనూ అసంతృప్తి ఉంది. అయితే.. ఇది చర్చలకే పరిమితం కాలేదు. సాక్షిలోని స్టోర్స్ సిబ్బంది కార్యాచరణకు దిగారు. తమకు.. 6.5 శాతం పెంపుదల ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. మరింత పెంచాలని డిమాండ్ చేస్తూ.. సమ్మెలోకి వెళ్లిపోయారు. మూడు రోజులుగా వారు సాక్షి ప్రింటింగ్ కార్యాలయాల్లో.. విధులు నిర్వహించడం లేదు. స్టోర్స్ సిబ్బంది.. అంతా విధులకు దూరంగా ఉండి.. తమ నిరసన తెలియచేస్తున్నారు.

సాక్షిలో పని చేస్తున్న అన్ని విభాగాల్లో ఉద్యోగుల పరిస్థితి అంతే ఉంది. వీరికి మద్దతుగా మిగిలిన విభాగాల వారూ రంగంలోకి దిగవచ్చని.. ప్రచారం జరుగుతోంది. సాక్షి యూనిట్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ఆగిపోయినా.. ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. గెలిస్తే.. అన్నీ వస్తాయని… ఆశ పెట్టేసి.. తీరా గెలిచాక.. అరకొర విదిలింపులు చేస్తే.. అసంతృప్తి ఎలా ఉంటుందో..జగన్మోహన్ రెడ్డికి.. ఇంటా బయటా తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close