కేసీఆర్ ఫ్రెంట్‌ మీద స్టాలిన్ ఆస‌క్తిగా ఉన్నార‌ట‌..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో భేటీ అయ్యారు క‌దా! భాజ‌పాయేత‌ర కాంగ్రెసేత‌ర ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటు గురించి చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే, ఈ చ‌ర్చ‌ల‌పై కేవ‌లం కేసీఆర్ కోణం నుంచి మాత్ర‌మే సాక్షి ప‌త్రిక కథ‌నాలు రాసింది. తెలంగాణ‌, ఆంధ్రా ఎడిష‌న్ల‌లో కూడా ఒకే ర‌క‌మైన ప్రెజెంటేష‌న్ ఇచ్చింది. ఈ చ‌ర్చ‌ల్లో కేసీఆర్ మాట్లాడింది మాత్ర‌మే రాశారు! దానికి స్టాలిన్ ఎలా స్పందించారో, అస‌లు ఆయ‌న రెస్పాండ్ అయ్యారో లేదో కూడా సాక్షి క‌థ‌నంలో క‌నిపించ‌దు. కానీ, కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌ల‌పై స్టాలిన్ సానుకూలంగా స్పందించేశార‌నీ, మ‌రోసారి క‌లిస్తే ఫ్రెంట్ ప్ర‌క‌ట‌నే త‌రువాయి అన్న‌ట్టుగా విశ్లేషించేసింది సాక్షి!

జాతీయ పార్టీల ఆధ్వ‌ర్యంలో కేంద్ర ప్ర‌భుత్వాలు ఏర్ప‌డితే దాని వ‌ల్ల రాష్ట్రాల ఆకాంక్ష‌లు నెర‌వేర‌డం లేద‌నీ, ప్రాంతీయ ఆకాంక్షలు నెర‌వేరితేనే దేశంలో నిజ‌మైన అభివృద్ధి సాధ్య‌మ‌ని స్టాలిన్ కి కేసీఆర్ చెప్పిన‌ట్టు రాశారు. లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయ‌నీ, దాదాపు 20 ఏళ్ల కిందిటి మాదిరిగా ప్రాంతీయ పార్టీలు బ‌ల‌మైన శ‌క్తులుగా మార‌తాయని స్టాలిన్ కి కేసీఆర్ చెప్పిన‌ట్టు రాశారు. మొత్తానికి, కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌కు స్టాలిన్ అనుకూలంగా స్పందించార‌ని తెరాస నేత‌లు చెబుతున్నారంటూ రాసేశారు! ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ లో క‌లిసి వ‌చ్చేందుకు డీఎంకే ఆస‌క్తిగా ఉంద‌ని విశ్లేషించేశారు!

కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌పై స్టాలిన్ అంత ఆస‌క్తితో ఉంటే… ఆ విష‌యాన్ని ఆయ‌నే మీడియాతో చెప్పాలి క‌దా, చెప్పలేదే? ఈ భేటీలో పాల్గొన్న టీఆర్ బాలు కూడా మీడియాతో ఏమీ మాట్లాడ‌లేదే..? మ‌రో నేత దురైమురుగ‌న్ న‌వ్వుకుంటూ స్టాలిన్ నివాసం నుంచి బ‌య‌ట‌కి వ‌స్తూ… ఏం జ‌రిగింద‌ని అడిగిన మీడియాకు… నాకేం తెలియ‌దు అంటూ స‌మాధానం చెప్పి వెళ్లిపోయారే..? చెన్నై నుంచి బ‌య‌ల్దేరే ముందు కేసీఆర్ అయినా మీడియాతో మాట్లాడ‌లేదే..? ఇప్ప‌టికే కాంగ్రెస్ తో త‌మ‌కు పొత్తు ఉంద‌నీ, రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా తానే ప్ర‌పోజ్ చేశాన‌ని కేసీఆర్ కి స్టాలిన్ చెప్పార‌ట‌! ఆ విషయం సాక్షిలో క‌నిపించ‌లేదు. వీలైతే మీరూ కాంగ్రెస్ కూట‌మికి మ‌ద్ద‌తు ఇవ్వండ‌ని కేసీఆర్ ను స్టాలిన్ కోరిన‌ట్టు స‌మాచారం. అది కూడా ఆ ప‌త్రిక‌లో క‌నిపించ‌లేదు. మ‌రి, ఏ లెక్క‌న స్టాలిన్ సానుకూలంగా ఉన్న‌ట్టుగా క‌థ‌నాలు రాసేశారో వారికే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close