సాక్షి కుట్ర సిద్ధాంతం..! ఇసుక మాయ చంద్రబాబు, లోకేష్‌దేనట..!

కుట్రల సిద్ధాంతంలో సాక్షి దినపత్రిక.. అడ్వాన్సుడ్‌ స్టేజీకి వెళ్లిపోతోంది. గత మూడు నెలలుగా ఏపీలో తీవ్రమైన ఇసుక కొరత.. బ్లాక్‌మార్కెట్ కారణంగా పెరిగిపోయిన ధరలతో.. నిర్మాణ రంగం కుదేలయిపోయింది. లక్షల మంది కార్మికులు .. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఇలాంటి సమయంలో… ఏపీ సర్కార్.. కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావడానికి నెలల తరబడి సమయం తీసుకుంటోంది. కొత్త విధానం తేవాలనుకున్నా… అసలు సరఫరాను ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో .. ప్రభుత్వం కూడా క్లారిటీగా చెప్పలేకపోతోంది. అదే సమయంలో… విచ్చలవిడిగా జరగుతున్న బ్లాక్ మార్కెట్ విక్రయాలను ఎందుకు చూసీచూడనట్లుగా వదిలేశారో కూడా.. ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఈ సమయంలో ఐదో తేదీ నుంచి ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తేవడానికి రంగం సిద్ధం చేసుకుంది.

అయితే.. ఇసుక కొత్త విధానంపై… ఏపీ ప్రభుత్వానికీ నమ్మకం లేదేమోకానీ.. మొత్తానికి.. ఓ కుట్ర సిద్దాంతాన్ని.. తన గెజిట్ లాంటి సాక్షి పత్రిక ద్వారా బయటకు తీసుకు వచ్చింది. ఇసుక రీచ్‌ల నుంచి.. స్టాక్ యార్డులకు ఇసుక తరలించడానికి ఏపీ సర్కార్ టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లను.. చాలా మంది.. చాలా తక్కువకు దాఖలు చేశారు. టన్నుకు రూ. పదిహేను.. నుంచి యాభై రూపాయల వరకు దాఖలు చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు.. వారంతా.. టీడీపీ నేతలంతా.. సాక్షి పత్రిక ప్రచారం ప్రారంభించింది. టెండర్లు దక్కించుకున్న తర్వాత ఇసుక కొరత సృష్టించడానికి.. చంద్రబాబు, లోకేష్ కలిసి టీడీపీ నేతలతో టెండర్లు వేయించారన్నట్లుగా చెప్పుకొచ్చింది.

నిజానికి.. ఇసుక రవాణాపై ఎలాంటి నిర్ణయమైనా ప్రభుత్వానిదే తుది నిర్ణయం. టెండర్లు దాఖలు చేసిన వాళ్లు… చెప్పిన రేటుకు సప్లయ్ చేయకపోతే.. వెంటనే ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు. వాళ్లు రవాణా ఆపేసినంత మాత్రాన.. ప్రభుత్వం కంగారుపడిపోయి.. ఇసుక కొరత వచ్చేస్తుందని చెప్పుకోవడం… వైఫల్యాన్ని ఒప్పుకోవడమే. సాక్షి పత్రిక ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది. కానీ ఇసుక కొరతపై.. టీడీపీ ఈ రోజు ధర్నాలకు పిలుపునిచ్చింది. అందుకే.. ఏదో ఒకటి… చంద్రబాబు, లోకేష్‌లపై ఇసుక చల్లితే చాలన్నట్లుగా సాక్షి కథనం రెడీ చేసిందని సులువుగానే అర్థమవుతుంది. తక్కువకు ఇసుక టెండర్లు దాఖలు చేసేవాళ్లు టీడీపీ కుట్రతోనే చేస్తున్నారని అంటున్న సాక్షి.. మరి మద్యం దుకాణాలకు.. రూపాయికే.. అద్దెకిస్తామని ముందుకొస్తున్నారని.. గొప్పగా చెప్పుకుంది. మరి దీని వెనుక కూడా టీడీపీ నేతలున్నారని.. రేపోమాపో కథనం రాయబోతున్నారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close