సీఎం ప్ర‌సంగంలో మిగతా అంశాలు సాక్షికి క‌నిపించ‌వా.?

నోడ‌ల్ అధికారుల‌తో ఏర్పాటైన ఒక స‌మావేశంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. వారికి దిశానిర్దేశం చేశారు. దాదాపు గంట‌సేపు సీఎం ప్ర‌సంగం సాగింది. ఈ సంద‌ర్భంగా చాలా అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్థావించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి, ప్రజల సంతోషాన్ని పెంచాల్సిన బాధ్య‌త అధికారుల‌పైనే ఉంటుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంపై సాక్షి క‌వ‌రేజ్ ఎలా ఉందంటే… నోడ‌ల్ అధికారుల‌కు సీఎం క్లాస్ తీసుకున్నారూ, అధికారుల ప‌నితీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారూ, ఒక్కరోజు కార్య‌క్ర‌మానికి ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు, నిధుల విడుద‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు, ఇదంతా ఏదో వ్రుథా ఖర్చు అనే కోణంలో ప్రెజెంట్ చేశారు.

పెన్ష‌న్లు, ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌లకు చేరువ చేసేది అధికారులే కాబ‌ట్టి.. ప్ర‌జ‌ల్లో సంతృప్తి స్థాయిని పెంచ‌గ‌లిగేది మీరే అంటూ సీఎం చెప్పారు. అంతేకాదు, ఒక్కో అధికారీ ఒక నాయ‌కుడిలా వ్య‌వ‌హ‌రిస్తూ, కింది స్థాయివారితో క‌లిసి గ్రామాల్లో ప‌ర్య‌టించాల‌న్నారు. ప్ర‌జ‌ల్లో సంతృప్తిని చూడాల‌న్నారు. అయితే, ఈ సంద‌ర్భంగా కొన్ని చోట్ల ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నా… అక్క‌డి అధికారుల తీరు వ‌ల్ల ప్ర‌జ‌ల్లో కొంత అసంతృప్తి క‌లుగుతోంద‌న్నారు. కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌ను న‌వ్వుతూ ప‌ల‌క‌రించాల‌నీ, వారితో కాసేపు కాస్త ప్రేమ‌గా మాట్లాడితే చాల‌నీ… ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంద‌ని సీఎం చెప్పారు. అంతేకాదు, ఈ సంద‌ర్భంగా అధికారుల కృషి వల్ల సాధించిన విజ‌యాల‌ను గురించి కూడా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్థావించారు.

సాక్షిలో రాసిన‌ట్టుగా జ‌న‌వ‌రిలోపు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రించేయాల‌ని హుకుం జారీ చెయ్య‌లేదు! ఇప్పుడున్న ల‌క్ష్యాల‌ను జ‌న‌వ‌రిలోకి అందుకోవాల‌నీ, జ‌న‌వ‌రి నాటికి గుర్తించిన సమ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసి… దాంతో ఐదేళ్ల దీర్ఘకాలిక ప్ర‌ణాళిక‌ను త‌యారు చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. గ్రామ స్థాయి, మండ‌ల స్థాయి, జిల్లా స్థాయి…. ఇలా రాష్ట్రస్థాయి వ‌ర‌కూ ఒక విజ‌న్ త‌యారు చేసుకునేందుకు వీలుగా అధికారులు కృషి చేయాల‌న్నారు.

ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం అంతా ఇలా అధికారుల్లో స్ఫూర్తి నింపే విధంగా, ఉత్సాన్ని నింపే విధంగా పాజిటివ్ మూడ్ లో సాగింది. ప్ర‌జ‌ల్లో సంతృప్తిని చూడ‌గ‌లిగేది, వారిలోని ఆనందాన్ని పెంచ‌గ‌లిగేది క్షేత్ర‌స్థాయిలో అధికారులు మాత్ర‌మే అని చాలా స్ప‌ష్టం చెప్పారు. కానీ, సాక్షి క‌థ‌నం చూస్తుంటే… సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు ఉద్యోగుల వైఖ‌రే అడ్డంకిగా ఉంద‌ని సీఎం క్లాస్ తీసుకున్న‌ట్టు ప్రెజెంట్ చేశారు. వారిపై మండిపడేందుకే ఈ కార్యక్రమం పెట్టారన్నట్టుగా ఉంది. అంతేకాదు, ఇంత కీల‌క‌మైన స‌మావేశానికి ల‌క్ష‌ల రూపాయాలు ఖ‌ర్చు అయిపోయాయంటూ సాక్షి వాపోవ‌డం మ‌రీ విడ్డూరం. రాష్ట్రస్థాయి స‌మావేశం, ముఖ్య‌మంత్రి పాల్గొన్న పాల్గొన్న స‌ద‌స్సు… ఇలాంటివి నిర్వ‌హించినా కూడా అదేదో అన‌వ‌స‌ర ఖ‌ర్చు అన్న‌ట్టుగా దీన్లో కూడా విమ‌ర్శ‌ల కోణాన్ని వెతుక్కోవ‌డానికి ఏ ర‌క‌మైన జ‌ర్న‌లిజం అంటారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close