సమంత వచ్చేసిందోచ్!

యస్… సమంత ఈజ్ బ్యాక్! బ్యాక్ టు హైదరాబాద్. అక్కినేని నాగచైతన్య కూడా! భార్యాభర్తలు ఇద్దరూ గత నెలలో అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. చైతు-సమంతల ప్రేమ యాత్ర ముగిసింది. రెగ్యులర్ షూటింగులు, సినిమా కబుర్లకు దూరంగా కొన్నాళ్లు కాలక్షేపం చేసి వచ్చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన అఖిల్ బ‌ర్త్‌డే పార్టీలో సందడి చేశారు. ఫ్యామిలీ మెంబెర్స్, క్లోజ్ ఫ్రెండ్స్‌కి ఇచ్చిన పార్టీలో వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారట. ఈరోజు నుంచి హాలిడే హ్యాంగోవర్, పార్టీలకు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి సినిమా పనులతో వారు బిజీ బిజీ అవుతారని సమాచారం. సమంత నటించిన తాజా సినిమా ‘రంగస్థలం’ విడుదల సమయంలో ఆమె ఇక్కడ లేదు. విడుదలకు ముందే అమెరికా చెక్కేశారు. సినిమాకి, అందులో రామలక్ష్మిగా సమంత నటనను మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కనుక… అందరితో సంతోషాన్ని పంచుకోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో వున్నారు. ‘రంగస్థలం’ ప్రచార కార్యక్రమాలు, కొత్త సినిమా పనులతో సమంత బిజీ. ఇక, చైతూ విషయానికి వస్తే.. ‘సవ్యసాచి’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా షూటింగుల్లో పాల్గొంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.