నాగచైతన్య – సమంతల బంధం గురించి విడమరచి చెప్పక్కర్లెద్దు. సినిమా ప్రపంచం మొత్తానికి వీళ్లే హాట్ టాపిక్. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం కోడై కూస్తోంది. చైతూ గురించి మాట్లాడుకొంటున్నప్పుడు సమంత టాపిక్.. సమంత గురించి చెప్పుకొనేటప్పుడు చైతూ టాపిక్ తీయడం రివాజుగా మారింది. అలాంటిది ఓ ఇంటర్వ్యూలో చైతూ పరువు తీసేసింది సమంత. నోరు జారి.. చైతూ ఇమేజ్‌ని మరీ ఆవగింజంత చేసి పారేసింది. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ తో జత కట్టింది సమంత. ఎన్టీఆర్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియర్స్ చెప్పండి?? అని అడిగితే ”బృందావనం నుంచీ నాకు ఎన్టీఆర్ బాగా క్లోజ్. బృందావనం సమయంలో చాలా సహాయపడ్డాడు. ఎందుకంటే అప్పటి వరకూ నేను పెద్ద హీరోలతో నటించింది లేదు” అంది.
ఈ కామెంట్లో వివాదాస్పద మైన వ్యాఖలేం లేకపోయినా… అక్కినేని అభిమానులు మాత్రం అంత వరకూ పెద్ద హీరోతో నటించింది లేదు.. అనే పాయింట్‌ని భూతద్దంలో చూడ్డం మొదలెట్టారు. సమంత తొలి చిత్రం ఏం మాయ చేశావె. ఆ తరవాతే ఎన్టీఆర్‌తో బృందావనంలో నటించే అవకాశం వచ్చింది. అంటే.. నాగచైతన్య చిన్న హీరో అనే కదా అర్థం. చైతూతో రిలేషన్లో ఉంటూ… తన పరువు తీయడం తప్పు కదా అనేది వాళ్ల ఆర్గ్యుమెంట్. నిజానికి సమంత అన్నదాంట్లోనూ తప్పులేదు. చైతూ తొలి సినిమా జోష్ ఫ్లాప్. ఆ తరవాతే ఏం మాయ చేశావేలో నటించాడు. అప్పటికి చైతూ చిన్న హీరో కిందే లెక్క. కానీ… ‘అక్కినేని ఇంటి నుంచి వచ్చాడు కదా’ అన్నది నాగ్ ఫ్యాన్స్ పాయింట్. మొత్తానికి నోరు జారి అక్కినేని ఫ్యాన్స్‌కి అడ్డంగా దొరికిపోయింది సమంత.