ఓ బేబీ… స‌మంత‌లోని ది బెస్ట్ బ‌య‌ట‌ప‌డ‌బోతోందా?

విడుద‌లకు ముందు కొన్ని సినిమాల‌కే పాజిటీవ్ వైబ్రేష‌న్స్ క‌నిపిస్తుంటాయి. `ఓ బేబీ` విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఈ సినిమాపై ముందు నుంచీ పాజిటీవ్ టాకే న‌డుస్తోంది. టీజ‌ర్లూ, ట్రైల‌ర్లూ.. వాటికి మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర‌బృందం మాట‌ల్లో కాన్ఫిడెన్స్ బాగానే క‌నిపిస్తోంది. స‌మంత అయితే ఈ సినిమాని ఓన్ చేసేసుకుంది. త‌నైతే మ‌రింత న‌మ్మ‌కంగా మాట్లాడుతోంది. `నా కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా` అంటోంది. మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం, యూ ట‌ర్న్ – ఇలా.. స‌మంత ఈమ‌ధ్య గొప్ప పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. వాటిని మించిన పాత్ర‌ `ఓబేబీ`తో ద‌క్కిందంటే – న‌టిగా మ‌రో మెట్టు ఎదిగిన‌ట్టే క‌దా? స‌మంతలోని అత్యుత్త‌మ ప్ర‌తిభ ఈ సినిమాతో బ‌య‌ట‌ప‌డ‌బోతోంద‌ని ఈ సినిమా చూసిన‌వాళ్లు చెబుతున్నారు. రాఘ‌వేంద్ర‌రావుకి ఈ సినిమా చూపించారు. ఆ వెంట‌నే.. స‌మంత‌ని మెచ్చుకుంటూ సోష‌ల్ మీడియాలో ఆయ‌న పోస్ట్ కూడా పెట్టారు. వెంక‌టేష్ కూడా ప్రీ రిలీజ్ ఈ వెంట్లో `బేబీ అద‌ర‌గొట్టేసింది..` అంటూ సమంత‌కి కితాబులు అందించాడు.

ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో స‌మంత న‌టన ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని టాక్‌. సినిమా అంతా అల్ల‌రి అల్ల‌రిగా న‌టించేసిన స‌మంత‌, ఆ రెండు చోట్ల మాత్రం క‌న్నీళ్లు పెట్టించింద‌ట‌. అస‌లు ఈ సినిమాకి అతి పెద్ద హైలెట్ ఆ రెండు స‌న్నివేశాలే అని తెలుస్తోంది. మొత్తానికి మ‌రో సినిమాని త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించేస్తోంది స‌మంత‌. బేబీగా త‌న విశ్వ‌రూపం ఎలా ఉందో చూడాలంటే.. మ‌రి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close