సమంత… సావిత్రి కాబోయిందట..! మరి జెమిని గణేషన్ ఎవరు..?

సమంత రూథ్ ప్రభు… తెలివి తేటలను.. టాలీవుడ్‌లో ఏ ఒక్కరూ తక్కువగా అంచనా వేయరు. ఆమె ఎవర్నీ బాధపెట్టరు. అలా అని తనూ బాధపడరు.. అంత ఒడుపుగా టాలీవుడ్‌లో తన కెరీర్‌ను నడిపించేస్తున్నారు. ఇప్పుడు అక్కినేని వారింటి కోడలు కూడా. కెరీర్ బెస్ట్ అనే విధంగా సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె తన పాత జ్ఞాపకాలు కొద్దిగా కదిలించినా.. అందరికీ ఆసక్తికరమే. విశాల్‌తో తన కొత్త సినిమా అభిమన్యుడు విడుదల సందర్భంగా.. మీడియాలకు ఇంటర్యూలు ఇచ్చింది. అయితే ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం.. చాలా కొత్త విషయాన్ని బయటపెట్టింది. ఇప్పటి వరకూ.. రూమర్స్‌గా ఇండస్ట్రీలో.. బయట ప్రచారంలో ఉన్న దాన్ని నిజమేనని ఒప్పుకున్నారు.

ఇంతకీ ఆ నిజం ఏమిటంటే.. తాను అంతకు ముందే ప్రేమలో పడిందట. అదీ కూడా అలా ఇలా కాదు… కొంచెం తేడా వచ్చినా.. సావిత్రిలా తన జీవితం మారిపోయి ఉండేదని ఇప్పుడు రియలైజ్ అయ్యేంతగా. సావిత్రి జీవితం నుంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు.. సమంత మొత్తం ఓపెన్ అయిపోయారు. కొద్దిలో ఉంటే తానూ వ్యక్తిగత జీవితంలో సావిత్రినయిపోయేదాన్నని భయపడ్డారు. అసలు కథ విన్నప్పుడు తన కథలానే అనిపించిందట. అదృష్టం కొద్ది బయటపడ్డానన్నారు.
నిజానికి సమంత విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి కానీ… ఆమె గురించి తెలిసిన వారు పెద్దగా నమ్మరు. కానీ.. ఒకే ఒక్కరితో సమంత లవ్ విషయంలో మాత్రం జోరుగానే ప్రచారం జరిగింది. హీరో సిద్ధార్ధ్‌తో ఆమె ఓ సారి కుటుంబసభ్యులతో సహా శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజలు చేశారు. అప్పుడే సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమయిందో కానీ బ్రేకప్ అయిపోయింది. కానీ ఆమె ఎక్కడా ఈ విషయాన్ని పబ్లిక్‌గా ప్రస్తావించలేదు. కానీ తాను ఆ ప్రేమలో సక్సెస్ అయి ఉంటే.. ఇప్పుడు జీవితంలో ఫెయిల్ అయి ఉండే దాన్నని అనుకోవడమే కాదు.. తన జీవితం సావిత్రి మాదిరిగా మారిపోయి ఉండేదని భయపడుతున్నారు. మొత్తానికి సమంత… లక్కీ గర్ల్‌నే..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close