సమంత- నాగచైతన్య.. విరహం

ప్రేమంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడం. ఒకర్ని వదిలి ఇంకొకరు వుండలేకపోవడం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇద్దరు మనుషులు ఒకే ప్రాణంతో జీవించడం. అలాంటి మనషులు దూరాన్ని భరించలేవు. ఎడబాటును తట్టుకోలేవు. ఆ విరహం వర్ణనాతీతం. ఇప్పుడు ఇవే ఫీలింగ్స్ నాగాచైతన్య-సమంతలు అనుభవిస్తున్నారు.

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు నాగాచైతన్య- సమంత. అయితే పెళ్ళికి ముందే పీకల్లోతు ప్రేమల్లో మునిగితేలుతున్న జంట ఇది. పెళ్ళికి ముందు ప్రేమ అద్భుతమైన ఫీలింగ్. ఒకర్ని వదిలి ఇంకొకరు ఒక్క నిమిషమైన హాయిగా వుండలేని క్షణాలివి. అయితే ఇపుడు చైతుకి దూరంగా వెళ్ళాల్సివస్తుంది సమంతకు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగానెల రోజుల పాటు తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లాల్సి వస్తోంది. ఈ ఎడబాటు సమంత భరించలేకపోతుంది. ఏ ఫీలింగైనా సోషల్ మీడియాలో పెట్టడం సమంత కు అలవాటు కదా. దీంతో ట్విట్టర్ ఓపెన్ చేసి తన ఫీలింగ్స్ ను రాసేసింది సామ్.

‘అసలు నేనెందుకు షూటింగ్ కు వెళ్లాలి? అని మొదలుపెట్టిన సమంత.. ‘‘నా హెల్త్ పాడైతే ? నా విమానం టేకాఫ్‌ కాకుంటే? వర్షం పడి ఆగిపోతే?.. ప్లీజ్‌ నన్ను వెళ్లనివ్వొద్దు” అంటూ నాగచైతన్యతో దిగిన ఓ ఫోటో ను షేర్ చేసింది. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. ఈ పోస్ట్ చుసిన వారందరూ ప్రేమంటే ఇదేరా.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.