ఆ సినిమా త‌ర‌వాత‌.. స‌మంత‌కు బ్రేక్‌!?

స‌మంత‌… అక్కినేని స‌మంత‌గా మారిన త‌ర‌వాత‌, సినిమాల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఎక్క‌డా కంగారు ప‌డ‌డం లేదు. సినిమాల‌కంటే వ్య‌క్తిగ‌త జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ని క‌థ‌లొచ్చినా.. ప‌క్క‌న పెడుతోంది. స‌మంత చేతిలో `శాకుంత‌ల‌మ్‌` సినిమా ఒక్క‌టే ఉంది. గుణశేఖ‌ర్‌ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా త‌ర‌వాత‌.. స‌మంత కొత్త క‌థ‌లేవీ ఒప్పుకోలేదు. ఎందుకంటే.. స‌మంత కొన్నాళ్లు బ్రేక్ తీసుకోబోతోంద‌ట‌. అందుకే.. కొత్త సినిమాల‌పై సంత‌కం పెట్ట‌డం లేద‌ని తెలుస్తోంది. స‌మంత మ‌న‌సు ఇప్పుడు మాతృత్వం వైపు మ‌ళ్లింద‌ని, అందుకే… సినిమాల‌కు కొంత‌కాలం గ్యాప్ ఇవ్వాల‌నుకుంటోంద‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. అందులో భాగంగా.. ఇప్ప‌టికే ఒప్పుకున్న ఓ సినిమాని సైతం స‌మంత ప‌క్క‌న పెట్టేసింద‌ట‌. `శాకుంత‌ల‌మ్‌` త‌ర‌వాత‌.. క‌నీసం యేడాదిన్న‌ర పాటు స‌మంత ఎవ్వ‌రికీ దొర‌క్క‌పోవొచ్చు. ఆ త‌ర‌వాత‌… స‌మంత క‌థ‌ల ఎంపిక‌లో మ‌రింత మార్పు రావొచ్చు. మ‌రి స‌మంత కోసం అల్లుకుంటున్న క‌థ‌ల‌న్నీ ఏమైపోతాయో..???

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close