శ‌మంతక‌మ‌ణి.. మెరిసిపోతోందిక్క‌డ‌!!

టాలీవుడ్‌లో ఆస‌క్తి రేపుతున్న ప్రాజెక్ట్‌… శ‌మంత‌క‌మ‌ణి. న‌లుగురు యువ హీరోలు క‌ల‌సి న‌టించ‌డం, ఆ న‌లుగురు హీరోల‌కూ కాస్తో కూస్తో ఇమేజ్ ఉండ‌డం, అది కాస్త‌ క్రైమ్ కామెడీ కావ‌డంతో ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందా?? అనే ఆస‌క్తి మొద‌లైంది. దానికి తోడు.. ట్రైల‌ర్‌, టైటిల్ ఆక‌ట్టుకొంటున్నాయి. భ‌లే మంచి రోజు తో.. తొలి అడుగులోనే హిట్ కొట్టిన శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు అవ్వ‌డంతో ఆ ఫోక‌స్ మ‌రింత పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి ప‌బ్లిసిటీ కూడా ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి మ‌హేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు. ట్రైల‌ర్ చాలా స్టైలీష్‌గా ఉంద‌ని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ రంగంలోకి దిగుతున్నాడు. శ‌మంత‌క మ‌ణి ఆడియో ఫంక్ష‌న్‌.. ఈరోజు హైద‌రాబాద్‌లోజ‌ర‌గ‌బోతోంది. ఈ వేడుక‌కు బాల‌య్య ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. మ‌హేష్ బాబుతోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. సో.. ప‌బ్లిసిటీకి ఏమాత్రం కొర‌త లేద‌న్న‌మాట‌! మ‌రోవైపు బిజినెస్ కూడా లాభ‌దాయ‌కంగానే సాగుతోంద‌ట‌. ఈ సినిమాకి క‌నీ వినీ ఎరుగ‌ని టేబుల్ ప్రాఫిట్ ఖాయ‌మ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ఊహిస్తున్నాయి. ఈ సినిమా అనుకొన్న ఫ‌లితం సాధిస్తే.. ఈ త‌ర‌హా బుల్లి మ‌ల్టీస్టార‌ర్లు తెలుగులో మ‌రిన్ని రావ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.