ఇసుక కొరతతో ఆగిపోయిన జనసేన పార్టీ ఆఫీసు నిర్మాణం..!

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కు వంద రోజుల సమయం ఇస్తున్నామని.. ఆ తర్వాత స్పందిస్తామని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న నిర్ణయాలపై జనసేన ఇంత వరకూ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. దానిపైనే.. పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీకి కొత్త గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన.. బిశ్వభూషణ్ హరిచందన్‌ను.. ఇతర పార్టీ నేతలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, కార్యకలాపాల గురించి బిశ్వభూషణ్‌ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గవర్నర్‌తో చర్చించారు.

ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. వైసీపీ సర్కార్ పనితీరుపై..స్పందించడానికి వంద రోజుల గడువు పెట్టుకున్నట్లుగా ప్రకటించారు. పాలనను అర్థం చేసుకోవడానికి జగన్‌కు కొంత సమయం ఇవ్వాలని ..పాలన సరిగా లేకుంటే నిలదీస్తాం.. ప్రశ్నిస్తాం.. పోరాడతామని పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారు. ఇసుక కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇసుక లేకపోవడం వల్ల తమ పార్టీ కార్యాలయ నిర్మాణం ఆగిపోయిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. పాతికేళ్ల తర్వాత పరిస్థితి ఏంటన్న ఆలోచనే రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని..ఎన్నో ఓటములను తట్టుకొని నిలబడ్డాం..ఒక్క ఓటమి కుంగదీస్తుందా?.. అని కార్యకర్తలను ప్రశ్నించారు.

టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే నేరుగా పెట్టుకునే ధైర్యం ఉన్న వ్యక్తినన్నారు. దొంగచాటు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని ప్రకటించారు. రాజకీయ పార్టీ నడపడం సులువైన పని కాదని .. విమర్శిస్తున్నా సరే నిలబడ్డానంటే..రాజకీయ వ్యవస్థ మార్పు కోసమేనని పవన్ ప్రకటించారు. జనసైనికులపై దాడులు జరిగితే సహించేది లేదని … జనసైనికులకు అండగా ఉంటా..ఎవరూ భయపడవద్దని అందరికీ ధైర్యం చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close