సందీప్‌ కిష‌న్ ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం లో నిత్యా మీనన్

ప్ర‌స్థానం’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన యంగ్ హీరో సందీప్‌కిష‌న్‌. ‘రొటీన్ ల‌వ్‌స్టోరి’, ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘బీరువా’, ‘టైగ‌ర్’ వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌తో మంచి స‌క్సెస్‌లు సాధించారు. ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ‘ ఒక్క అమ్మాయి త‌ప్ప’ చిత్రంలో న‌టిస్తున్నారు.దీనికి కాప్షన్, All Indians are My Brothers and Sisters.

అక్టోబర్ లో పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 18 నుండి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం లో విలక్షణమైన నటి నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ కిషన్, నిత్యా మీనన్ ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఒక స్పెషల్ హైలైట్ అవుతుంది అని నిర్మాత బోగాధి అంజిరెడ్డి అన్నారు.

నూత‌న ద‌ర్శ‌కుడు రాజ‌సింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.

హీరో సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేనొక తెలివైన కాలేజ్‌ కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. ఈ చిత్రం లో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తోంది. మా కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది ’’ అన్నారు.

దర్శకుడు రాజసింహ తాడినాడ మాట్లాడుతూ ‘‘ దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. ఈ సినిమాని మూడేళ్ళ క్రిత‌మే సందీప్‌కి చెప్పాను. సినిమాలో నలభై ఐదు నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటుంది. ఈ సినిమా కోసం ఫ్లై ఓవర్‌ సెట్‌ కూడా వేస్తున్నాం. ఈ నెల 18 నుండి రెగ్య‌ల‌ర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. కొత్త బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సందీప్‌ కొత్త‌గా క‌నిపిస్తాడు’’ అన్నారు.

నటీ నటులు – సందీప్ కిషన్, నిత్యా మీనన్, బ్రహ్మానందం, రవికిషన్‌, అలీ, తనికెళ్ళభరణి, రావు రమేష్‌, పృథ్వీ, సప్తగిరి తదితరులు.

సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, నిర్మాత: బోగాధి అంజిరెడ్డి, కథ, మాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజసింహ తాడినాడ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close