ఇలాగైతే తెలుగు సినిమాలు మానేస్తా: సందీప్ రెడ్డి

ఒక్క సినిమా… ఒకే ఒక్క సినిమాతో సందీప్ రెడ్డి స్టార్ ద‌ర్శ‌కుడు అయిపోయాడు. అర్జున్ రెడ్డి ప్ర‌భ‌జంనానికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ తానే అయిన సందీప్ రెడ్డి… ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌. సందీప్‌తో సినిమాలు చేయ‌డానికి బ‌డా హీరోలు సిద్దంగా ఉన్నారు. ఈ ద‌శ‌లో కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమాకి వ్య‌తిరేకంగా మ‌హిళా సంఘాలు గ‌ళ‌మెత్తాయి. అర్జున్ రెడ్డి ఆడుతున్న‌ కొన్ని థియేట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి – ఈ సినిమా చూడొద్దంటూ అడ్డుకొంటున్నాయి. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ విష‌యంపై కాస్త సీరియెస్‌గా స్పందించాడు సందీప్ రెడ్డి. మీ త‌దుప‌రి సినిమాపై ఈ విమ‌ర్శ‌లు ఎంత వ‌ర‌కూ ప‌నిచేస్తాయి? అని అడిగితే..

”న‌న్ను ఇక్క‌డ అడ్డుకోవాల‌ని చూస్తే బాలీవుడ్ వెళ్లిపోతా. హిందీ, భోజ్‌పురి, క‌న్న‌డ‌… ఇలా ఏ భాష‌లో అయినా సినిమాలు తీసుకొంటా. ఇండియాలో బ్యాన్ చేస్తే హాలీవుడ్ వెళ్లిపోతా. ఇంత‌కంటే న‌న్నేం చేయ‌మంటారు. అస‌లు మ‌హిళా సంఘాలు ఇలా ఎందుకు స్పందిస్తున్నాయో అర్థం కావ‌డం లేదు” అంటున్నాడు సందీప్‌. ఈ క‌థ మ‌రో సినిమా క‌థ‌కు కాపీ అన్న వివాదం ఒక‌టి కొత్త‌గా పుట్టుకొచ్చింది. దీనిపై కూడా సందీప్ మాట్లాడ్డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. అయితే సందీప్ రెడ్డి త‌దుప‌రి సినిమా శ‌ర్వానంద్‌తో అనేది దాదాపుగా ఖాయ‌మైపోయింది. మ‌రో న‌లుగురు నిర్మాత‌లు సందీప్ రెడ్డి కి అడ్వాన్సులు ఇవ్వ‌డానికి రెడీ అయ్యార్ట‌. అయితే.. సందీప్ మాత్రం ఇంకా ఎవ‌రితోనూ క‌మిట్ కాలేద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com