మనదేశంలో ఏమైనా జరుగుతుంది…

అవును మనదేశంలో ఏమైనా జరుగుతుంది. సాధారణంగా ‘ఇది ఇలా జరుగుతుందా’ అని మనం ఎవ్వరూ ఊహించలేని విషయాలు ఇక్కడ చాలా సునాయాసంగా జరిగిపోతుంటాయి! సాధారణంగా అయితే మన దేశంలో యావజ్జీవ శిక్ష పడిన వాళ్లు కూడా.. నిర్దిష్టంగా ఒక వ్యవధి వరకు శిక్ష అనుభవించిన తర్వాత మాత్రమే.. ‘సత్ప్రవర్తన’ కింద విడుదలకు వారిపేర్లను పరిశీలిస్తారు.. అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనది ప్రజాస్వామిక దేశం. ఎవరో పెద్దలు నిర్వచించినట్టు.. ‘ప్రజాస్వామ్యం అంటేనే అందరూ సమానులు… కొందరు మాత్రం అధిక సమానులు..’ ఆ అధికసమానుల విషయంలో ఏమైనా జరుగుతూ ఉంటుంది.

అవును ఏకే 56 వంటి తుపాకులను అక్రమంగా కలిగి ఉన్నందుకు, ఉగ్రవాద చట్టాల కింద అరెస్టు అయి నేర నిరూపణ అయి అయిదేళ్ల జైలుశిక్ష అనుభవించే నిమిత్తం ఎరవాడకు వెళ్లిన బాలీవుడ్‌ ఖల్‌నాయక్‌ గురువారం ఉదయం విడుదల అయిన వైనం గమనిస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. సంజయ్‌దత్‌ ను సత్ప్రవర్తన కారణంగా శిక్షాకాలం పూర్తికాకముందే విడుదల చేసేయడానికి ప్రభుత్వం అనుమతించింది. రిపబ్లిక్‌డే, మహాత్మాగాంధీ జయంతి లాంటి ప్రత్యేక సందర్భాలు ఏమీ లేవు. ఆయన కోసం విడిగా ఒక రోజు నిర్ణయించి.. ఇవాళ ఎంచక్కా ఇంటికి పంపేశారు. జైలునుంచి బయటకు వచ్చిన వెంటనే.. సంజయ్‌దత్‌ చాలా నాటకీయ శైలిలో జైలుకు శాల్యూట్‌ చేసి మరీ బయటకు వచ్చారు. సంజయ్‌దత్‌ విడుదల అయిన తీరును గమనిస్తే మన దేశంలో ఏమైనా సాధ్యం అవుతుందనే అనిపిస్తుంది.

అవును ఈ దేశంలో తప్పతాగి కారు నడుపుతూ పేవ్‌మెంట్‌ మీదికి ఎక్కేసి ఒక వ్యక్తి చావుకు కారకుడైనాడని ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ నూరుశాతం నిర్దోషిగా బయటపడగలడు. ఈ దేశంలో రాజకీయంగా తమ శత్రుపక్షం రాజ్యం చేస్తున్నప్పటికీ కూడా.. అడ్డగోలుగా సత్ప్రవర్తన కారణం మీద సంజయ్‌దత్‌ వెలుపలికి రాగలడు.

సెలబ్రిటీలు అయితే చాలు.. అనగా ప్రజాస్వామ్య నిర్వచనం ప్రకారం.. అధిక సమానులు అయితే చాలు.. వారి విషయంలో ప్రభుత్వాల్లో ఎవరు రాజ్యం చేస్తూ ఉండినా సరే.. అంతా సానుకూలంగా జరిగిపోతుంది. వారికి అనుకూలంగానే నిర్ణయాలు వస్తాయి. అందుకే మన దేశంలో ఎప్పుడు ఏమైనా సాధ్యం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close