స‌ర్దార్‌ హైప్‌.. ప్ల‌స్సా? మైన‌స్సా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడూ ప‌బ్లిసిటీ స్టంట్‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. అస‌లు నా సినిమాకీ, నాకూ ప‌బ్లిసిటీనే అవ‌సరం లేద‌నుకొనే క‌థానాయ‌కుల్లో ప‌వ‌న్ పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. వీలైనంత లోప్రొఫైల్‌లో త‌న సినిమా బ‌య‌ట‌కు రావాల‌నుకొంటాడు ప‌వ‌న్‌.కానీ.. ప్ర‌తీసారీ త‌న సినిమా అంటే అంచ‌నాలు పెరిగిపోతూ ఉంటాయి. అయితే.. స‌ర్దార్ – గ‌బ్బ‌ర్ సింగ్ విష‌యంలో ‘హై’ క్రియేట్ చేస్తూ వ‌చ్చాడు ప‌వ‌న్‌. చిరంజీవిని స‌ర్దార్ ఆడియో ఫంక్ష‌న్‌కి తీసుకురావ‌డం, అంత‌కు ముందు రోజు మీడియాతో పవ‌న్ మాట్లాడ‌డం, స‌ర్దార్ డైరీస్ అంటూ.. స‌ర్దార్ విశేషాల‌తో కూడిన స‌మాచారాన్ని ప్ర‌తీ రోజూ విడుద‌ల చేయ‌డం.. ఇవ‌న్నీ సినిమాకి హైప్ క్రియేట్ చేయ‌డంలో భాగాలే.

స‌ర్దార్ టీమ్ కూడా.. త‌మ సినిమాకి ప్ర‌చార మాధ్య‌మాల్లో వీలైనంత ప‌బ్లిసిటీ రావాల‌ని కోరుకొంటోంది. ఇదంతా.. స‌ర్దార్ బిజినెస్‌కి హెల్ప్ అవుతుంద‌ని వాళ్ల న‌మ్మ‌కం. సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉంటే.. మ‌రో బిజినెస్ ఎలిమెంట్ అవ‌స‌రం లేదు.కానీ… ఇంకాస్త హైప్ కోరుకోవ‌డం విడ్డూరంగా అనిపించినా, ఆ ప్ర‌య‌త్నం స‌ర్దార్‌కి లాభాన్నే చేకూర్చింది. ఈ సినిమా ప్రీ బిజినెస్ సుమారు రూ.90 కోట్ల వ‌ర‌కూ జ‌రిగింద‌ని టాక్‌. ఆ లెక్క‌న శ‌ర‌త్‌మ‌రార్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌లు విడుద‌ల‌కు ముందే భారీ స్థాయిలో టేబుల్ ప్రాఫిట్ సంపాదించేసుకొన్న‌ట్టు లెక్క‌.

సాధార‌ణంగా ప‌వ‌న్ సినిమా అంటే రూ.60 కోట్ల వ‌ర‌కూ ప్రీ బిజినెస్ జ‌రుగుతుంటుంది. స‌ర్దార్ విష‌యంలో 50 శాతం పెరిగిన‌ట్టే. అంటే ఇదంతా ప‌వ‌న్ తాలుకూ స్ట్రాట‌జీ పుణ్య‌మా? లేదంటే స‌ర్దార్‌పైనే సినీ జ‌నాల‌కు అంత న‌మ్మ‌కం క‌లుగుతుందా? ఈ హైప్ సినిమాకి ప్ల‌స్సా?? మైన‌స్సా?? ఇవ‌న్నీ ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మిగిలాయి. మా ప‌వ‌న్ సినిమా బంప‌ర్ లెవిల్లో బిజినెస్ చేసుకొంది అని ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డుతున్నా.. ఇంత హైప్ వ‌ల్ల సినిమాకి న‌ష్టం జ‌రుగుతుందేమో, సినిమా అటూ ఇటుగా ఉంటే.. ప‌రిస్థితి ఏంటి? అని కొంత‌మంది అభిమానులు భ‌య‌ప‌డుతున్నారు. ఏప్రిల్ 8 వ‌ర‌కూ ఈ టెన్ష‌న్ భ‌రించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close