మార్చ 12న సర్ధార్ గబ్బర్ సింగ్ అడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ మూవీ గబ్బర్ సింగ్ కు కొనసాగింపుగా కాకపోయినా ఆ సినిమా టైటిల్ కు ముందు సర్ధార్ అని పెట్టి మరోసారి బాక్సాఫీస్ మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది తర్వాత గోపాలా గోపాలలో గెస్ట్ రోల్ చేసిన పవర్ స్టార్ సినిమా ఆ మాత్రమన్నా వసూళ్లను రాబట్టడానికి కారకుడయ్యాడు. ఇక ప్రస్తుతం తను నటిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా కోసం పవన్ రేయింబవళ్లు కష్టపడి చిత్రీకరణ జరుపుతున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల చేస్తామని అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా ఆడియోని మార్చ్ 12న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మి ఓ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుంది.

ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మితమవుతున్న సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో శరత్ మారర్ నిర్మించడం జరుగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మరోసారి పవర్ స్టార్ అభిమానులకు కచ్చితంగా పండుగ వాతావరణం తీసుకొచ్చేలా ఉంటుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close