‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజ్ డేట్ ఖరారయ్యింది!

హైదరాబాద్: ‘గోపాల గోపాల’ పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో హీరోగా నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ వచ్చి రెండేళ్ళు దాటిపోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం విడుదల తేది ఖరారయింది. రానున్న ఉగాదికి 2016 సంవత్సరం ఏప్రిల్ 8న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ పాత్రలో, లక్ష్మీ రాయ్ ప్రత్యేక పాత్రలో కనిపించున్నారు. గుజరాత్‌లో ఇటీవలే కొంత షూటింగ్ చేసుకుని వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన తర్వాత మళ్ళీ గుజరాత్, రాజస్థాన్ వెళ్ళి మరికొంత షూటింగ్ జరుపనున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ సందర్భంగా ఆలీ, బ్రహ్మాజీలతో పవన్ సెల్ఫీలు సోషల్ మీడియాలో ప్రస్తుతం రౌండ్స్ కొడుతున్నాయి. పవన్ ఇటీవల తరచూ యూనిట్ లోని నటీనటులతో సెల్ఫీలలో నవ్వుతూ కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

మరోవైపు ఫిబ్రవరినాటికి షూటింగ్ పూర్తి చేసి మార్చిలో ఆడియో నిర్వహించాలని చిత్ర బృందం యోచిస్తోంది. అయితే పవన్ పొలిటికల్ షెడ్యూల్ ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఈ తేదీలు పక్కా అని అనుకోవటానికికూడా వీల్లేదు. త్వరలో జరగనున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పోటీచేసే అవకాశం ఉందని ఇవాళ వార్తలొచ్చాయి. అదే కనుక నిజమైతే సర్దార్ మరింత వెనక్కు వెళ్ళక తప్పదు. పవన్ కళ్యాణ్, ఆయన మిత్రుడు శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇరోస్ ఇంటర్నేషనల్ సమర్పిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close