అహ్మదాబాద్ స్టేడియానికి పటేల్ పేరు తీసేసి మోడీ పేరు..!

సర్దార్ పటేల్ అంటే బీజేపీ పెద్దలకు ఎంత గౌరవమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రూ. మూడు వేల కోట్లు పెట్టి.. అహ్మదాబాద్‌లో ఆయనకు అత్యంత భారీ ఎత్తున విగ్రహం కూడా పెట్టించారు. ఎక్కడికి వెళ్లినా పటేల్ నామస్మరణ చేస్తూంటారు. ఇంత ాచేసిన ఆయన కాంగ్రెస్ నేత. బీజేపీ నేత కూడా కాదు. అయినప్పటికీ.. గుజరాత్ ప్రైడ్ గా… ఆయనను ఓన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన పేరును తొలగించి మోడీ పేరు పెట్టుకునే కార్యక్రమాలను ప్రారంభించడమే చర్చనీయాంశం అవుతోంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.

మోతెరాగా ప్రసిద్ధి పొందిన ఆ స్టేడియాన్ని ఇప్పుడు విస్తరించారు. లక్షా పదివేల సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద స్డేడియంగా తీర్చిదిద్దారు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్ ఆ స్టేడియంలోనే ప్రారంభమయింది. కానీ.. సర్దార్ పటేల్ స్టేడియంలో కాదు. నరేంద్రమోడీ స్టేడియంలో. అంటే సర్దార్ పటేల్ పేరు తీసేసి.. నరేంద్రమోడీ పేరు పెట్టారన్నమాట. ఇలా పేరు మారుస్తున్న విషయం చాలా గోప్యంగా ఉంచారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్టేడియాన్ని ప్రారంభించే సమయంలో మాత్రం… అహ్మదాబాద్‌లోని మెతెరాలో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం.. ఇక లేదని.. అక్కడ ఉన్నది నరేంద్రమోడీ స్టేడియం అని తేలిపోపోయింది.

1982లో 49 వేల సీటింగ్ సామర్థ్యంతో పటేల్ స్టేడియాన్ని నిర్మించారు. 2015లో లక్షా 10 వేల సీటింగ్ కెపాసిటీతో భారీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది గతేడాది ఫిబ్రవరిలోనే పూర్తయ్యింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌కు వచ్చిన వేళ ఈ స్టేడియాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇప్పుడు మోడీ పేరు పెట్టి కొత్తగా ఓపెనింగ్ చేశారు. మొత్తానికి పటేల్‌ను రీప్లేస్ చేసేందుకు మోడీ, షాలు ఉత్సుకతతో ఉన్నారనన్న సైటైర్లు ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close