సర్దార్ ఫిక్స్ చేశారు.. బన్ని ఏం చేస్తాడో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుండి షూటింగ్ చేస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు ముగించేస్తున్నారు. బాబి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శరత్ మారర్ నిర్మిస్తుండగా.. ఈరోస్ ఇంటర్నేషనల్ వారు విడుదల చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు సినిమా రిలీజ్ ఏప్రిల్ రిలీజ్ అని చెబుతున్నా కన్ ఫర్మ్ అని చెప్పలేదు.

కాని సినిమా నిర్మాత శరత్ మారర్ సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న కచ్చితంగా రిలీజ్ అవుతుందని వెళ్లడించారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో సినిమా భారీగా అమ్ముడయ్యిందని తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అదిరిపోయే విధంగా జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా సర్దార్ రిలీజ్ డేట్ ప్రకటించిన రోజునే అల్లు అర్జున్ సరైనోడు సినిమా విడుదల అంటున్నారు.

బోయపాటి శ్రీను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరైనోడు. ఈ సినిమాను కూడా ఏప్రిల్ 8న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. అయితే సర్దార్ కు పోటీగా బన్ని వస్తాడా..? పవర్ స్టార్ సినిమాకు పోటీగా వచ్చే గట్స్ బన్నికి ఉన్నాయా అన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తెలుస్తున్న సమాచారం ఏంటంటే బన్ని సినిమా ఏప్రిల్ చివరన రిలీజ్ చేసేలా ఆలోచిస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సరైనోడు సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రేసా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close