స‌ర్దార్ సెన్సార్ రిపోర్ట్ ఇదే

కొద్ది సేప‌టి క్రింద‌ట స‌ర్దార్ సినిమా సెన్సార్ పూర్త‌య్యింది. ఈ సినిమాకి యూ బై ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బృందం. సినిమా ప‌క్కా మాస్‌, యాక్ష‌న్, క‌మ‌ర్షియ‌ల్ పంథాలో సాగింద‌ని సెన్సార్ రిపోర్ట్. సినిమా అంత‌టినీ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న భుజ స్కంధాల‌పై వేసుకొని న‌డిపించాడ‌ని, ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షోల్లో ఈ సినిమా నిలిచిపోతుంద‌ని తెలుస్తోంది. కాజ‌ల్ ఓ పాట‌లో ఎప్పుడూ లేనంత‌గా గ్లామ‌ర్ కురిపించింద‌ట‌. స‌ర్దార్ ఇంట్ర‌వెల్ ఫైట్ ఓ రేంజులో వ‌చ్చింద‌ని, పొటిటిక‌ల్ డైలాగ్స్ బాగా పేలాయ‌ని, కొంత‌మంది పొలిటీష‌న్స్‌కి ప‌వ‌న్ ప‌రోక్షంగా ఈ సినిమాలో సెటైర్లు వేశాడ‌ని తెలుస్తోంది. అనుకొన్న స‌మ‌యంలో సెన్సార్ పూర్త‌వ్వ‌డం, దానికి పాజిటీవ్ బ‌జ్ రావ‌డం ప‌ట్ల చిత్ర‌బృందం సంతోషంగా ఉంది. ఏప్రిల్ 8న స‌ర్దార్ రావ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌బృందం తెలిపింది. స‌ర్దార్ సినిమా రెండు పాట‌లు మిన‌హా పూర్త‌య్యింది. ఆ మిగిలిన రెండు పాట‌ల్నీ ఏప్రిల్ 2వ తేదీన సెన్సార్ చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close