ఆరు కోట్ల‌కు అమ్మేశారు.. ఇప్పుడు చుక్క‌లు చూపిస్తున్నారు

విజ‌య్ సినిమాకి తెలుగులో ఆరు కోట్ల రేటు రావ‌డ‌మే గొప్ప‌. `స‌ర్కార్‌`తో ఆ ఫీట్ సాధ్య‌మైంది. మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు కావ‌డం, కీర్తి సురేష్ లాంటి తెలుగు ట‌చ్ ఉన్న అమ్మాయి క‌థానాయిక కావ‌డం, ఈ దీపావ‌ళికి పెద్ద‌గా తెలుగు సినిమాలేం లేక‌పోవ‌డం బాగా క‌లిసొచ్చింది. అందుకే ఆరు కోట్ల‌కు తెలుగు రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక్క‌డ తెలుగులో కొన్న నిర్మాత కూడా.. రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ మంచి రేట్ల‌కు ఈసినిమాని అమ్ముకున్నాడు. దాదాపుగా ఆయ‌న గట్టెక్కేసిన‌ట్టే. కాక‌పోతే తెలుగులో స‌ర్కార్ సినిమాకి ఏమాత్రం బ‌జ్ లేదు. సాధార‌ణంగా తెలుగులో శుక్ర‌వారం సినిమా విడుద‌ల అవుతుంటుంది. లేదంటే గురువారం. `స‌ర్కార్‌` మాత్రం మంగ‌ళ‌వారం విడుద‌ల అవుతోంది. అలాంట‌ప్పుడు `మంగ‌ళవారం మా సినిమా వ‌స్తోంద‌హో` అని గ‌ట్టిగా చెప్పుకోవాలి. విజ‌య్ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూసేంత అభిమానులు తెలుగులో లేరు. కాబ‌ట్టి.. పబ్లిసిటీ ముఖ్యం. కానీ `స‌ర్కార్‌` ప‌బ్లిసిటీ లేమితో అల్లాడుతోంది.

రూ.6 కోట్ల‌కు సినిమాని అమ్మేసిన త‌మిళ నిర్మాత‌లు క‌నీసం… సినిమాకి సంబంధించిన స్టిల్స్ కూడా తెలుగు నిర్మాత‌కు ఇవ్వ‌డం లేదు. ఇక ప్రెస్ మీట్ల‌కూ, ప్ర‌మోష‌న్ల‌కూ టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తారు? `తెలుగులో ప్ర‌మోష‌న్ల‌కు నేను రాను` అని విజ‌య్ గ‌ట్టిగానే చెప్పేశాడు. మురుగ‌దాస్‌దీ అదే మాట‌. తెలుగులో తీసిన `స్పైడ‌ర్‌` హిట్ట‌యి ఉంటే, మురుగ‌దాస్ ఈసినిమా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొనేవాడేమో. ఆ సినిమా ఫ్లాప్‌తో టాలీవుడ్‌లో ప్ర‌చారానికి ఆయ‌న మొహం చాటేశాడు. దానికి తోడు `కాపీ క‌థ‌` అనే ముద్ర ఒక‌టి ప‌డిపోయింది. దాంతో మురుగ‌దాస్ కూడా తెలుగు ప్ర‌చారానికి డుమ్మా కొట్టాడు. ఇంకొన్ని గంట‌ల్లో `స‌ర్కార్‌` విడుద‌లైపోతోంది. కానీ.. తెలుగులో ప్ర‌మోష‌న్లు ఇంకా మొద‌ల‌వ్వ‌లేదు. అదీ… తెలుగు స‌ర్కార్ దీన స్థితి. తెలుగులో త‌న‌కంటూ ఓ మార్కెట్ సృష్టించుకోలేక అల్లాడిపోతున్న విజ‌య్‌… అందుకోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేయాలి క‌దా?? సూర్య‌, కార్తి, విక్ర‌మ్‌, విశాల్‌.. ఆఖ‌రికి క‌మ‌ల్ హాస‌న్ కూడా తెలుగులో త‌న సినిమాని డ‌బ్బింగ్ రూపంలో విడుదల చేస్తున్న‌ప్పుడు ప్ర‌మోష‌న్లు జోరుగా చేసుకుంటారు. కానీ విజ‌య్‌కి మాత్రం ఆ స్పృహ లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close