అక్క‌డా అద‌ర‌గొట్టేస్తున్నాడు

స‌రైనోడుగా ఈ స‌మ్మ‌ర్‌లో మంచి హిట్టు కొట్టాడు అల్లు అర్జున్‌. నెగిటీవ్ టాక్ వ‌చ్చినా స‌రే, సినిమాని నిల‌బెట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. తెలుగు నాట ఈ సినిమా రూ.70 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు మ‌ల‌యాళంలోనూ విడుద‌లైంది. బ‌న్నీకి అక్క‌డ కూడా విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ శుక్ర‌వారం మ‌ల్లూవుడ్‌లో ఈ చిత్రం యోధావు – ది వారియ‌ర్ పేరుతో విడుద‌లైంది. దాదాపు 80 స్ర్కీన్స్‌లో ఈ సినిమాని విడుద‌ల చేశారు. చాలా చోట్ల హోస్‌ఫుల్ బోర్డులు ద‌ర్శ‌న‌మిచ్చాయి. తొలి రోజు దాదాపుగా 65 ల‌క్ష‌ల‌ రూపాయ‌ల వ‌ర‌కూ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్టు టాక్‌.

మ‌ల్లూవుడ్‌లో ఓ పెద్ద హీరో సినిమాకి ఎన్ని వ‌సూళ్లు వ‌స్తాయో.. బ‌న్నీ సినిమాకి అన్నే వ‌చ్చాయ‌ని చిత్ర‌బృందం సంతోషం వ్య‌క్తం చేస్తోంది. అక్క‌డ ఈ సినిమా దాదాపు రూ.4 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసే అవ‌కాశాలు న్నాయ‌ని టాక్‌. కేర‌ళ‌లో బ‌న్నీ ఈ సినిమా కోసం విప‌రీతంగా ప్ర‌చారం చేశాడు. అది కూడా భారీ ఓపెనింగ్స్ రావ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయి. నాలుగు వారాలు ఆల‌స్యంగా విడుద‌లైనా.. మ‌ల్లూవుడ్‌లో మంచి వ‌సూళ్లు రావ‌డం ప‌ట్ల బ‌న్నీ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడ‌ట‌. సొంత సినిమా క‌దా, అందుకే అంత హుషారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close