శ‌శిక‌ళ చేసిన మూడు శ‌ప‌థాలు ఇవేనా..!

శ‌శిక‌ళ రాజ‌కీయ జీవితం అర్ధంత‌రంగా ముగిసిపోయింద‌ని చాలామంది మురిసిపోతున్నారు! జ‌య‌ల‌లిత అక్ర‌మ ఆస్తుల కేసులో తీర్పు రావ‌డంఓ ఆమె జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. కానీ, ఇది ముగింపు కాదు.. విరామం మాత్ర‌మే అనేది శ‌శిక‌ళ ప్ర‌వ‌ర్త‌న చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మౌతుంది. త‌న పోరాటం ఇక్క‌డితో ఆగేది కాద‌నీ, జైల్లోకి వెళ్లినంత మాత్రాన తాను ఓడిన‌ట్టు కాద‌న్న సంకేతాలు ఇచ్చారు. బెంగ‌ళూరు బ‌య‌లుదేరే ముందు చెన్నైలోని అమ్మ స‌మాధికి చిన్న‌మ్మ వెళ్లారు. ఎంతో భావోద్వేగ‌తంతో జ‌య స‌మాధికి న‌మ‌స్క‌రించి.. మూడుసార్లు స‌మాధిపై గ‌ట్టిగా చ‌రిచారు. దీనిపై ఎవ‌రికి న‌చ్చిన విశ్లేష‌ణ‌లు వారు ఇచ్చుకుంటున్నారు. వ్యంగ్యంగా కామెంట్లు చేసేవారు కూడా ఉన్నారు.

అయితే, ఈ మూడు శ‌ప‌థాలు అనుకోవాలి! ఆమె ముందున్న మూడు ల‌క్ష్యాలుగా భావించాలి. మొద‌టిది.. తాను జైల్లో ఉన్నాస‌రే అన్నాడీఎంకే పార్టీని ర‌క్షించుకుంటాన‌ని చెప్పిన‌ట్టు భావించొచ్చు! రెండోది.. ప‌న్నీర్ సెల్వ‌మ్ అంతు చూస్తా అని అనుకోవ‌చ్చు. ఎందుకంటే, ఢిల్లీ పెద్ద‌లు ఆడించే గంగిరెద్దుగా ఆయ‌న మారిపోయి, అన్నాడీఎంకే పార్టీని ప‌ణంగా పెట్టార‌న్న‌ది చిన్న‌మ్మ కోపం. మూడోది.. కేంద్రంలోని భాజ‌పా..! తాను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోవ‌డం ఇష్టం లేక‌పోవ‌డ‌మే ఇంత‌లా క‌క్ష సాధింపుల‌కు భాజ‌పా తెగ‌బ‌డింద‌న్న అభిప్రాయం ఆమెలో బ‌లంగా ఉంది. ఈ మూడింటిపైనా ఆమెకు ఉక్రోషం ఉండ‌టం స‌హ‌జం. ఇవే విష‌యాల‌ను ఆమె నేరుగా చెప్పే పరిస్థితి లేదు. ఆ ఉక్రోషాన్ని జ‌య స‌మాధి వ‌ద్ద ఇలా వెళ్ల‌గ‌క్కారు అనుకోవ‌చ్చు. అయితే, శ‌ప‌థాలు చేసినంత మాత్రాన వాటిని సాధించుకోవ‌డం సాధ్య‌మౌతుందా..? ప‌్ర‌స్తుతం కేంద్రంలో భాజ‌పా బ‌లంగా ఉంది క‌దా! వారి అభిప్రాయానికి వ్య‌తిరేకంగా ఉంటే ఏ స్థాయిలో రాజ‌కీయ క‌క్ష‌సాధింపులు ఉంటాయో అర్థ‌మౌనే ఉన్నాయి క‌దా! ప్రాంతీయ పార్టీల‌ను లొంగ‌దీసుకోవాల‌న్న ఒక సుదీర్ఘ ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది క‌దా!

అయితే, ఈ నేప‌థ్యంలో చిన్న‌మ్మ మూడు శ‌ప‌థాలు అలానే మిగిలిపోతాయి అని చెప్ప‌లేం. ఎందుకంటే, రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా మార‌తాయో ఎవ్వ‌రూ ఊహించలేరు. ప్ర‌స్తుతం జైలుకి వెళ్లినంత మాత్రాన శ‌శిక‌ళ పొలిటిక‌ల్ చాప్ట‌ర్ క్లోజ్ అని కూడా చెప్ప‌లేం. చిన్న‌మ్మ జైలు జీవితం త‌మిళుల్లో సింప‌థీ పెంచే అవ‌కాశం లేద‌నీ చెప్ప‌లేం. మొత్తానికి, తీవ్ర‌మైన ల‌క్ష్యాల‌తోనే చిన్న‌మ్మ జైలుకు బ‌య‌లుదేరారు. మ‌రి, అవి నెర‌వేరుతాయో లేదో అనేది కాలమే చెబుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close