అఖిల్ – ప్ర‌భాస్ కాంబినేష‌న్‌!

స‌క్సెస్‌లో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా కూల్‌గానే ఉంటారు… మ‌రి ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు కూడా కూల్‌గా ఉండేవాళ్లే హీరోలు అనేది లేటెస్ట్ టాలీవుడ్ ట్రెండ్‌. త‌న సినిమా విన‌య‌విధేయరామ ఫ్లాప్ అయింద‌ని రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి స్వ‌యంగా చెప్పాడు . రామ్‌చ‌ర‌ణ్‌తో క్లోజ్‌గా ఉండే అఖిల్ కూడా ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అవుతున్నడు . అందుకే టెన్ష‌న్‌తో కాకుండా కూల్‌గా అన్నిటినీ సెట్ చేసుకుంటున్నాడ‌ట‌. `అఖిల్`తో కెరీర్ మొద‌లుపెట్టిన అఖిల్ రెండో సినిమా `హ‌లో` క‌లిసి రాలేదు. మూడో సినిమా, ఫ్యామిలీ మార్కు సినిమా `మిస్ట‌ర్ మ‌జ్ను` గ‌త రెండు చిత్రాల క‌న్నా ఫ‌ర్వాలేద‌నిపించుకున్నా పెద్ద‌గా ఆడ‌లేదు. సో ఇప్పుడు అఖిల్ టెన్స్ తో కాకుండా కూల్‌గా ఆలోచించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు. ఆ నిర్ణ‌యం పేరు ప్ర‌భాస్‌. అవును.. అఖిల్ ఇప్పుడు ప్ర‌భాస్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్నాడు . ప్ర‌భాస్ అన‌గానే హీరో అనుకోకండి. ద‌ర్శ‌కుడు. ప్ర‌భాస్‌… ప్ర‌భాస్ పినిశెట్టి… స‌త్య ప్ర‌భాస్ పినిశెట్టి. ఆల్రెడీ తెలుగులో `మ‌లుపు` అని ఓ స్క్రీన్ ప్లే బేస్డ్ స‌బ్జెక్ట్ డైర‌క్ట్ చేసిన ద‌ర్శ‌కుడే స‌త్య ప్ర‌భాస్ పినిశెట్టి. ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడు ఇత‌డు. `మిస్ట‌ర్ మ‌జ్ను` ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే అఖిల్ ఇత‌ని ద‌గ్గ‌ర క‌థ విన్నాడు . ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కావ‌చ్చాయి. సో మార్చిలో సినిమా మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. అంటే శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలోనూ, క్రిష్ డైర‌క్ష‌న్‌లోనూ అఖిల్ సినిమా ఇమీడియేట్‌గా లేద‌న్న‌ది స‌త్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close