సారీయేగానీ… ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

క‌ట్ట‌ప్ప‌.. గొప్ప మెలికే వేశాడు. క‌న్న‌డీగుల‌కు సారీచెప్పిన‌ట్టే చెప్పి… బోల్డ‌న్ని ష‌ర‌తుల్ని లింకెట్టాడు. కావేరీజాలాల విష‌యంలో క‌ట్ట‌ప్ప స‌త్య‌రాజ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. స‌త్య‌రాజ్ కామెంట్ల వ‌ల్ల బాహుబ‌లి 2 పై దెబ్బ‌ప‌టేట్టు క‌నిపించింది. ఈ సినిమాని ఆపేస్తాం అంటూ క‌న్న‌డీగులు ఎదురుదాడికి దిగిన నేప‌థ్యంలో స‌త్య‌రాజ్ దిగి వ‌చ్చి సారీ చెప్ప‌క త‌ప్ప‌లేదు.

కానీ ఇక్క‌డే ఓ ట్విస్టు ఉంది. తాను ప‌డినా పైచేయి త‌న‌దే ఉంటేట్టు చూసుకోగ‌లిగాడు స‌త్య‌రాజ్‌. ఆ సారీ వెనుక‌.. కొన్ని ష‌రతులు క‌నిపించాయి. త‌న వ‌ల్ల ఓ సినిమాకి న‌ష్టం రావ‌డం ఇష్టం లేక సారీ చెప్పాన‌న్న స‌త్య‌రాజ్ అక్క‌డే అస‌లు ట్విస్ట్ ఇచ్చాడు. బాహుబ‌లి కోసం సారీ చెబుతున్నా అన్న‌ట్టున్నాయి స‌త్య‌రాజ్ వ్యాఖ్యానాలు. అంతే త‌ప్ప‌… మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ‌లు అడిగిన‌ట్టు క‌నిపించ‌లేదు. అంతేకాదు.. ఇక‌ముందు కూడా కావేరీ జలాల విష‌యంలో తాను త‌న గ‌ళం వినిపించ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌కు సినిమాల్లో అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల‌ని హిత‌వు ప‌లికాడు. ప‌దే ప‌దే త‌న‌తో క్ష‌మాప‌ణ‌లు చెప్పించాల‌ని చూడొద్ద‌ని హెచ్చ‌రిక‌లాంటిది జారీ చేశాడు. స‌త్య‌రాజ్ క్ష‌మాప‌ణ కేవ‌లం బాహుబ‌లి 2ని దాటించేయ‌డానికికే అన్న‌ది సుస్ప‌ష్టం. ఈ సినిమా విడుద‌లై, త‌న ప‌ని తాను చూసుకొని వెళ్లిపోయాక‌… మ‌ళ్లీ ఇదే విషయంపై స‌త్య‌రాజ్ గొంతు విప్పే అవ‌కాశం ఉంది. అందుకే.. `ఇక‌పై క్ష‌మాప‌ణ‌లు చెప్పే ప్ర‌స్త‌కి లేదు` అన్న‌ట్టు మాట్లాడ‌గ‌లుగుతున్నాడు. స‌త్య‌రాజ్ వ్యాఖ్య‌ల వెనుక ఉన్న అంత‌రార్థం క‌న్న‌డీగుల‌కు కూడా అర్థ‌మైంది. స‌త్య‌రాజ్ ఇలా మాట్లాడ‌డం, క్ష‌మాపణ‌లు చెప్పినా హెచ్చ‌రిక‌లా ఉండ‌డం… బాహుబ‌లి చిత్ర‌బృందానికి మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హార‌మే. బాహుబ‌లి 2కి గండం ఇంకా గ‌ట్టెక్క‌లేద‌నే అనిపిస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close