లాంఛనంగా ప్రారంభమైన సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’

‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టారు. రాజా, వేదవ్యాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘తిమ్మరుసు’ చిత్రానికి ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్‌.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ” కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్‌ తనకంటూఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘తిమ్మరుసు’ సినిమా విషయానికి వస్తే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. మంచి టీమ్‌ కుదిరింది. ఈ నెల 21 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్‌ షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాం” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుతో దిల్ రాజు సినిమా?

టాలీవుడ్ లోని బ‌డా హీరోలంద‌రితోనూ సినిమాలు తీశాడు దిల్ రాజు. అయితే ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌ ల‌తో మాత్రం సినిమాలు రాలేదు. చిరంజీవితో సినిమా చేయాల‌ని గ‌త కొంత‌కాలంగా భావిస్తున్నాడు...

స్థానిక ఎన్నికలపై ఏపీ బీజేపీకి ఒపీనియన్ లేదా..!?

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో రాజకీయ అలజడి రేగడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాకు ముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఏపీ సర్కార్ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నాయో.. ఇప్పుడు...

‘లూసీఫ‌ర్‌’ సెకండాఫ్ రిపేర్లు

చిరంజీవి దృష్టిలో ప‌డిన మ‌రో రీమేక్‌.. 'లూసీఫ‌ర్‌'. మోహ‌న్ లాల్ హీరోగా చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ బాధ్య‌త‌ల్ని చిరంజీవి వినాయ‌క్ చేతిలో పెట్టాడు. నిజానికి `లూసీఫ‌ర్‌` గొప్ప...

‘ఆహా’ కి క‌లిసొచ్చిన చిన్న సినిమాలు

ఈమ‌ధ్య మ‌ల‌యాళం డ‌బ్బింగుల్ని ఎక్కువ‌గా న‌మ్ముకొంది `ఆహా`. వ‌రుస‌గా మ‌ల‌యాళం డ‌బ్బింగులే వ‌స్తోంటే... `ఆహా`లో డబ్బింగులు మాత్ర‌మే వ‌స్తాయా? అంటూ సెటైర్లు కూడా వేసుకున్నారు సినీ అభిమానులు. కానీ చిన్న సినిమాల్ని కొనే...

HOT NEWS

[X] Close
[X] Close